Ind vs WI: భారత్ vs వెస్టిండీస్ హెడ్ టూ హెడ్ రికార్డులు, అత్యధిక రన్స్, వికెట్లు తీసిన ఆటగాళ్లు వీళ్లే!
ABN, First Publish Date - 2023-07-09T08:55:04+05:30
భారత్, వెస్టిండీస్ (West Indies vs India) మధ్య ఈ నెల 12 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి డొమినికా వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం భారత జట్టు ఇప్పటికే మ్యాచ్ వేదికైనా డొమినికా చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో భారత్, వెస్టిండీస్ మధ్య హెడ్ టూ హెడ్ రికార్డులు, రెండు జట్ల పోటీలో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో ఒక సారి పరిశీలిద్దాం.
భారత్, వెస్టిండీస్ (West Indies vs India) మధ్య ఈ నెల 12 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి డొమినికా వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం భారత జట్టు ఇప్పటికే మ్యాచ్ వేదికైనా డొమినికా చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో భారత్, వెస్టిండీస్ మధ్య హెడ్ టూ హెడ్ రికార్డులు, రెండు జట్ల పోటీలో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో ఒక సారి పరిశీలిద్దాం.
టెస్ట్ క్రికెట్లో భారత్, వెస్టిండీస్ ఇప్పటివరకు 98 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ పోటీలో కరేబియన్లదే పైచేయిగా ఉంది. వెస్టిండీస్ 30 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. భారత్ 22 మ్యాచ్‌ల్లో గెలిచింది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 1990వ దశకం వరకు భారత్‌పై వెస్టిండీస్ అధిపత్యం చెలాయించింది. కానీ ఆ తర్వాత భారత్ అధిపత్యం ప్రారంభమైంది. 2002 తర్వాత వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదంటేనే కరేబియన్లపై మన జట్టు రెండు దశాబ్దాలుగా ఏ స్థాయిలో అధిపత్యం చెలాయిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక రెండు జట్ల పోటీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా (Team India) దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) పేరు మీద ఉంది. కరేబియన్లపై గవాస్కర్‌కు అద్భుతమైన రికార్డులున్నాయి. విండీస్‌పై 27 మ్యాచ్‌లాడిన గవాస్కర్ 65 సగటుతో 2,749 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 13 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 236 పరుగులు. గవాస్కర్ కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇక రెండు జట్ల పోటీలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కూడా టీమిండియా బౌలర్ పేరు మీదనే ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) వెస్టిండీస్‌పై 25 మ్యాచ్‌లాడి 24 సగటుతో ఏకంగా 89 వికెట్లు పడగొట్టాడు.
అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఆటగాడు రోహన్ కన్హై పేరు మీద ఉంది. 1958లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో కన్హై ఏకంగా 256 పరుగులు బాదేశాడు. ఇక అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదుచేసిన రికార్డు టీమిండియా మాజీ బౌలర్ కపిల్ దేవ్ పేరు మీద ఉంది. 1983లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కపిల్ దేవ్ 83 పరుగులే ఇచ్చి ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ కెరీర్లో కూడా అత్యుత్తమ గణాంకాలు ఇవే. రెండు జట్ల పోటీలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు టీమిండియా మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్ (Sunil Gavaskar and Dilip Vengsarkar) పేరు మీద ఉంది. 1978లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గవాస్కర్, వెంగ్ సర్కార్ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 344 పరుగులు జోడించారు.
Updated Date - 2023-07-09T08:55:04+05:30 IST