ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: మరో 15 రోజుల్లో వరల్డ్‌ కప్ టికెట్ల అమ్మకాలు షురూ.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

ABN, First Publish Date - 2023-08-09T19:47:01+05:30

భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్లపై బీసీసీఐ, ఐసీసీ కీలక ప్రకటన చేశాయి. ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్లు ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించాయి.

భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్లపై బీసీసీఐ, ఐసీసీ కీలక ప్రకటన చేశాయి. ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్లు ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించాయి. దీంతో ఈ నెల 25 నుంచి అభిమానులు టికెట్లను కొనుగోలు చేయవచ్చు. భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు విక్రయించనున్నారు. దీంతో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు కూడా అప్పుడే అందుబాటులో ఉండనున్నాయి. ఇక సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల అమ్మకాలు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతాయి. మొత్తంగా మరో 15 రోజుల్లో ప్రపంచకప్‌ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే అంతకన్నా ముందు ఈ నెల 15 నుంచి టికెట్లు కొనుగోలు చేయాలనుకునేవారు https://www.cricketworldcup.com/register వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే టికెట్ల అమ్మకాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు టికెట్లను ఎక్కడ బుక్ చేసుకోవాలి, టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి వంటి అన్ని రకాల వివరాలను తెలుసుకోవచ్చు.


అయితే టికెట్లను ఎలా కొనుగోలు చేయాలని వివరాల విషయానికొస్తే.. ముందుగా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం బుక్ మై షో లేదా పేటీఎమ్‌లో టికెట్లు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. అయితే ఆన్‌లైన్ టికెట్లు లేవని సమాచారం. దీంతో బుక్ చేసుకున్న వివరాలను చూపించి స్టేడియం లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి బుక్ చేసుకున్న తర్వాత బాక్సాఫీస్ కౌంటర్ల వద్ద భౌతికంగా టికెట్లను తీసుకోవలసి ఉంటుంది. ఇక ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐ 300 ఉచిత హాస్పిటాలిటీ టిక్కెట్‌లను ఇవ్వనుంది. వీటితోపాటు మ్యాచ్‌లు నిర్వహించే వేదికలు ప్రతి లీగ్ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీకి 1,295 టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లకు సంబంధించి అయితే 1,355 టికెట్లు ఇవ్వాలి.

Updated Date - 2023-08-09T19:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising