ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kohli: ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన విరాట్ కోహ్లీ, భారత దిగ్గజాలు

ABN, First Publish Date - 2023-06-03T16:37:11+05:30

ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident) భారత దిగ్గజాలు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident) భారత దిగ్గజాలు స్పందించారు. ఈ విషాద ఘటనపై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అభినవ్ బింద్రాతోపాటు (Abhinav Bindra) మరికొంత మంది క్రీడాకారులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఒడిశా రాష్టంలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో సుమారు 238 మంది మరణించగా, 900 మందికి పైగా గాయపడ్డారు. శుక్రవారం బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఈ ప్రమాదానికి గురయ్యాయి.

రైలు ప్రమాద ఘటనా స్థలంలో 200 అంబులెన్స్‌లు, 50 బస్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లతోపాటు 1200 మంది సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారని భువనేశ్వర్ అధికారులు తెలిపారు. మృతదేహాలను ట్రాక్టర్లతో సహా అన్ని రకాల వాహనాల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారని అధికారులు చెప్పారు.

రైలు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోహ్లీ ఆకాంక్షించారు. బాలాసోర్ రైలు ప్రమాద ఘటన దృశ్యాలు చూసి షాకింగ్‌కు గురయ్యానని భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ చెప్పారు. జూన్ 7 నుంచి ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారత జట్టుతో కలిసి కోహ్లీ ఇంగ్లాండ్‌లో ఉన్నారు.

దేశంలోనే నాల్గవ ఘోరమైన రైలు ప్రమాదం జరిగిందని, కోల్‌కతాకు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్‌కు 170 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.

Updated Date - 2023-06-03T16:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising