Rohit and Virat : రోహిత్, విరాట్‌కు రెస్ట్
ABN , First Publish Date - 2023-11-24T05:21:44+05:30 IST
మూడు ఫార్మాట్ల ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత జట్టు వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పయనం కానుంది. డిసెంబరు 10న ప్రారంభమయ్యే ఈ సిరీ్‌సలో టీమిండియా మూడు టీ20లు, మూడు

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్
న్యూఢిల్లీ: మూడు ఫార్మాట్ల ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత జట్టు వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పయనం కానుంది. డిసెంబరు 10న ప్రారంభమయ్యే ఈ సిరీ్‌సలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలతోపాటు రెండు టెస్ట్‌లు కూడా ఆడనుంది. అయితే వచ్చేనెల 17 నుంచి జరిగే వన్డే సిరీ్‌సకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడంలేదు. వరల్డ్ కప్‌తో అలసిపోయిన రోహిత్, విరాట్ తమకు నెలరోజులపాటు విశ్రాంతి కావాలని బోర్డును కోరినట్టు సమాచారం. తద్వారా సఫారీలతో టెస్ట్‌లకు తాజాగా బరిలో దిగాలని వారిద్దరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో.. కేఎల్ రాహుల్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పే అవకాశమున్నట్టు సమాచారం. ఇక..రాహుల్‌ను కెప్టెన్ చేస్తే అతడి డిప్యూటీగా శుభ్‌మన్ గిల్‌ను నియమించే అవకాశముంది.