ICC Rankings: ఒక్కో స్థానం ఎగబాకిన రోహిత్ శర్మ, జడేజా.. కోహ్లీ స్థానం ఎంతంటే..?
ABN, First Publish Date - 2023-07-26T16:32:12+05:30
ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను(ICC Test Ranking) విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెరో స్థానం ఎగబాకారు.
ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను(ICC Test Ranking) విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెరో స్థానం ఎగబాకారు. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానం ఎగబాకి 10 నుంచి 9వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నేతో కలిసి హిట్‌మ్యాన్ 9వ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి ఖాతాలో 759 చొప్పున రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత్ నుంచి టాప్ 10లో రోహిత్ ఒక్కడే ఉన్నాడు. గాయం కారణంగా చాలా రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న రిషబ్ పంత్ 12వ స్థానానికి పడిపోయాడు. వెస్టిండీస్‌పై సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ(Virat Kohli) స్థానంలో ఎలాంటి మార్పులు లేవు. 14వ ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. కాకపోతే మరో 22 రేటింగ్ పాయింట్లు పెరిగాయి. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో మొత్తం 733 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
విండీస్‌తో సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) 11 స్థానాలు ఎగబాకి 63వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. లబుషేన్, స్మిత్ రెండు మూడు స్థానాలో ఉన్నారు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ ఒక స్థానం ఎగబాకిన జడ్డూ 39వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక విండీస్‌తో రెండో టెస్టులో 5 వికెట్లతో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) ఐదు స్థానాలు ఎగబాకి 33వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. జడేజా మొదటి స్థానంలో, అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
Updated Date - 2023-07-26T16:32:12+05:30 IST