Rohit sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతాడా..? టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాను నడిపించేదెవరు..?
ABN, First Publish Date - 2023-11-22T12:57:16+05:30
Team India captain: ప్రపంచకప్ ముగిసింది. ట్రోఫి గెలిచి ఉంటే ప్రస్తుతం టీమిండియా ఫుల్ జోష్‌లో ఉండేది. కానీ అది జరగకపోవడంతో జట్టులో నైరాశ్యం అలుముకుంది. వీలైనంత త్వరగా ఆటగాళ్లంతా ఫైనల్ ఓటమి బాధ నుంచి బయటపడి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో అందరికీ వస్తున్న అనుమానం ఏంటంటే రాబోయే రోజుల్లో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతుడా?..
ప్రపంచకప్ ముగిసింది. ట్రోఫి గెలిచి ఉంటే ప్రస్తుతం టీమిండియా ఫుల్ జోష్‌లో ఉండేది. కానీ అది జరగకపోవడంతో జట్టులో నైరాశ్యం అలుముకుంది. వీలైనంత త్వరగా ఆటగాళ్లంతా ఫైనల్ ఓటమి బాధ నుంచి బయటపడి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో అందరికీ వస్తున్న అనుమానం ఏంటంటే రాబోయే రోజుల్లో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతుడా?.. లేదంటే కొత్త కెప్టెన్ వస్తాడా? నిజానికి ప్రపంచకప్ ముగిశాక ఈ ప్రశ్న ఉత్పన్నం కావడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ జట్టైనా ప్రపంచకప్ ట్రోఫీని గెలవడంలో విఫలమైనప్పుడు ఇలాంటి చర్చలు తెరపైకి వస్తుంటాయి. రోహిత్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. పైగా హిట్‌మ్యాన్ వయసు కూడా ఎక్కువే. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 36 సంవత్సరాలుగా ఉంది. సాధారణంగా క్రికెట్ నుంచి ఈ వయసులోనే చాలా మంది రిటైర్ అవుతుంటారు. అలాంటిది ఈ వయసులో జట్టుకు కెప్టెన్సీ చేయడమంటే కాస్త కష్టంతో కూడుకున్న పనే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్‌పై ఒత్తిడి పెట్టకుండా ఉండేందుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించినా లేదంటే తనకు తానుగా తప్పుకునే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
మరో రెండేళ్లు..
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఇప్పటికిప్పుడు వచ్చిన ఢోకా ఏం లేదని పలువురు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వన్డేలు, టెస్టుల్లో రోహిత్ శర్మనే మరికొంత కాలం టీమిండియా కెప్టెన్‌గా కొనసాగాలని అంటున్నారు. దీనికి పలు కారణాలు కూడా చెబుతున్నారు. అవి ఏంటంటే.. నిజానికి ఈ ప్రపంచకప్‌లో టీమిండియాను రోహిత్ శర్మ అద్భుతంగా నడిపించాడు. ఒక కెప్టెన్‌గా జట్టుకు ఏం చేయాలో అంతకుమించే చేశాడు. ముఖ్యంగా బ్యాటర్‌గా ఎలాంటి స్వార్థం లేని ఆటను ఆడాడు. సొంత రికార్డుల కోసం కాకుండా జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే పరుగులు చేశాడు. కీలక సమయాల్లో అద్భుత నిర్ణయాలు తీసుకుని జట్టును గెలిపించాడు. ఫైనల్లో పరిస్థితులు మనకు అనుకూలంగా లేక, మన జట్టు అదృష్టం కూడా బాగాలేకపోవడంతో నిరాశ ఎదురైందని పలువురు చెబుతున్నారు. అంతేకానీ హిట్‌మ్యాన్ కెప్టెన్సీపై కూడా ఎక్కడా విమర్శలు రాలేదు. అంతెందుకు ఐసీసీ ప్రకటించిన వరల్డ్ కప్ ప్లేయింగ్ 11లో కూడా కెప్టెన్‌గా రోహిత్ శర్మకే చోటు దక్కింది. ఇక టీమిండియాలో ఇప్పటికిప్పుడు రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయ కెప్టెన్ కూడా లేడు. 2007 తర్వాత రాహుల్ ద్రావిడ్‌కు ప్రత్యామ్నాయ కెప్టెన్‌గా ధోని, ధోని తర్వాత విరాట్ కోహ్లీ, 2021 తర్వాత కోహ్లీకి ప్రత్యామ్నాయంగా రోహిత్ శర్మ రేసులో ఉన్నారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏం కనిపించడం లేదు. టెస్టులు, వన్డేల్లో హిట్‌మ్యాన్ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరంటే ఫలానా ఆటగాడు అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. గతంలో కేఎల్ రాహుల్ కొన్ని మ్యాచ్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ అతని కెప్టెన్సీ నైపుణ్యంపై విమర్శలు ఉన్నాయి. పైగా కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతను బ్యాటర్‌గా రాణించలేకపోతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసినా పూర్తి స్థాయి నాయకుడిగా అతనిపై నమ్మకం ఉంచలేం. గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌కు అనుభవం లేదు. ఇక టెస్టుల్లో అయితే ఇప్పటికిప్పుడు రోహిత్ శర్మ ప్రత్యామ్నాయ కెప్టెన్ ఎవరంటే ఒకరి పేరు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. దీంతో మరికొంత కాలం రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాబోయే రెండేళ్లపాటు హిట్‌మ్యానే భారత జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి 2025లో జరిగే ఛాంపియన్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ వరకు రోహిత్ శర్మనే జట్టు కెప్టెన్‌గా ఉండే అవకాశాలున్నాయి.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ ఎవరు?..
మరో 6 నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 4 నుంచి 30 వరకు ఈ ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఎవరు ఉంటారనేది తేలాల్సి ఉంది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన తర్వాతి నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని బీసీసీఐ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా పెట్టింది. వారిపై పని ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో అప్పటినుంచి టీ20ల్లో టీమిండియాకు హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ పేస్ ఆల్ రౌండర్ అయినా హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ దృష్యా ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనే అనుమానాలున్నాయి. హార్దిక్ పాండ్యా గాయపడితే త్వరగా కోలుకోవడం లేదు. గాయాలతో ఇప్పటికే పలుమార్లు జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో కూడా గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. అతను తిరిగి కోలుకోవడానికి మరో 4 నెలల పట్టొచ్చని తెలుస్తోంది. నేరుగా ఐపీఎల్ 2024లోనే హార్దిక్ ఆడే అవకాశాలున్నాయి.
దీనిని బట్టి ఈ మధ్యలో టీమిండియా ఆడే టీ20 సిరీస్‌లో హర్దిక్ పాండ్యా ఆడడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్‌లోనే టీ20 ప్రపంచకప్ ఉంది. దీంతో హార్దిక్‌కు నేరుగా టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించకపోవచ్చు. దీనిని బట్టి టీ20 ప్రపంచకప్‌లో కూడా రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది జరగాలంటే ప్రస్తుతం హిట్‌మ్యాన్‌ను టీ20 జట్టులోకి తీసుకోవాలి. ప్రస్తుతం రోహిత్ శర్మ విశ్రాంతి కారణంగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడడం లేదు. వచ్చే నెలలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడేసి చొప్పున టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడనుంది. ఈ పర్యటనలో రోహిత్ శర్మ టీ20ల్లో ఆడినా, ఆ ఫార్మాట్‌లోనూ అతనే కెప్టెన్‌గా ఉన్నా రాబోయే ప్రపంచకప్‌లో కూడా జట్టుకు అతనే నాయకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే ఆ ప్రపంచప్‌లో ఆడకపోవచ్చు. దీంతో ఈ విషయమై సౌతాఫ్రికా పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అయితే కొంతకాలం క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన రోహిత్ శర్మ అక్కడ జూన్‌లో జరిగే ప్రపంచకప్‌లో ఆడడానికి ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. అంటే పరోక్షంగా తాను ఇంకా టీ20 జట్టులో ఉన్నానని చెప్పినట్టైంది. మొత్తంగా ఈ విషయమై సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Updated Date - 2023-11-22T13:08:40+05:30 IST