Yashaswi Jaiswal: యశస్వి జైస్వాల్ రనౌట్.. సంజూ శాంసన్‌పై విమర్శలు.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-05-06T08:30:36+05:30 IST

గతేడాది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లోనూ తన జోరు ప్రదర్శిస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది.

Yashaswi Jaiswal: యశస్వి జైస్వాల్ రనౌట్.. సంజూ శాంసన్‌పై విమర్శలు.. వీడియో వైరల్!

గతేడాది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) ఈ సీజన్‌లోనూ తన జోరు ప్రదర్శిస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ (GTvsRR) జరిగింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్ టీమ్ ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

సూపర్ ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashaswi Jaiswal) రనౌట్ కావడం అభిమానులను నిరుత్సాహ పరిచింది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) వల్లే యశస్వి రనౌట్ అయ్యాడని అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీమ్ పవర్ ప్లే ముగిసే సమయానికి 50/1తో పటిష్ట స్థితిలోనే ఉంది. ఈ సమయంలో యశస్వి రనౌట్ కావడం (Yashaswi Jaiswal Run out) మ్యాచ్‌ను మలుపు తిప్పింది. రషీద్ (Rashid Khan) వేసిన ఆరో ఓవర్ మొదటి బంతిని సంజూ ఆఫ్ సైడ్ ఆడాడు. పాయింట్‌లో ఉన్న అభినవ్ మనోహర్ డైవ్ చేసి ఆ బంతిని ఆపాడు.

Virat Kohli: దూకుడు, కోపమే కాదు.. విరాట్ కోహ్లీలో ఈ కోణం కూడా ఉంది..

పక్కనే ఉన్న మోహిత్ శర్మ ఆ బంతిని పట్టుకుని నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. అప్పటికే బ్యాటర్లు ఇద్దరూ పరుగు ప్రారంభించారు. అయితే అభినవ్ బాల్ ఆపడంతో సంజూ పరుగు పూర్తి చేయకుండా తన క్రీజులోకి వెళ్లిపోయాడు. మరోవైపు యశస్వి కూడా సంజూ ఉన్న వైపు వచ్చేశాడు. దీంతో యశస్వి రనౌట్ అయి వెనుదిరిగాడు. అనవసరంగా యశస్విని సంజూ రనౌట్ చేశాడని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.

Updated Date - 2023-05-06T08:30:36+05:30 IST