Share News

గిల్‌కు ఐసీసీ అవార్డు

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:32 AM

సూపర్‌ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డును గెలుచుకున్నాడు...

గిల్‌కు ఐసీసీ అవార్డు

దుబాయ్‌: సూపర్‌ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డును గెలుచుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో అదరగొట్టిన గిల్‌, అనంతరం చాంపియన్స్‌ ట్రోఫీలోనూ సత్తా చాటాడు. దీంతో ఫిబ్రవరి నెలకుగాను ఈ ఐసీసీ అవార్డు విజేతగా నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌, న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్‌ ఫిలి్‌ప్సలను వెనక్కి నెట్టి గిల్‌ ఈ పురస్కారం దక్కించుకోవడం విశేషం. కాగా, ఈ అవార్డు నెగ్గడం గిల్‌కు ఇది మూడోసారి. గతంలో 2023లో రెండుసార్లు దీన్ని అందుకున్నాడు.

ఇవీ చదవండి:

ర్యాంకింగ్స్.. టాప్‌-5లో ముగ్గురు భారత స్టార్లు

ధోని కొత్త అవతారం.. కప్పు కోసం..

లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 13 , 2025 | 04:32 AM