ఢిల్లీ ప్రత్యర్థి ఎవరో?
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:34 AM
మహిళల ప్రీమియర్ లీగ్‌లో నాకౌట్ సమరానికి సర్వం సిద్ధమైంది. త్రుటిలో నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకొన్న మాజీ చాంప్ ముంబై ఇండియన్స్.. గురువారం జరిగే ఎలిమినేటర్‌లో...

రాత్రి 7.30 నుంచి
స్టార్‌స్పోర్ట్స్‌లో..
నేటి ఎలిమినేటర్‌లో ముంబై X గుజరాత్
నెగ్గిన జట్టుకు ఫైనల్లో చోటు
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో నాకౌట్ సమరానికి సర్వం సిద్ధమైంది. త్రుటిలో నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకొన్న మాజీ చాంప్ ముంబై ఇండియన్స్.. గురువారం జరిగే ఎలిమినేటర్‌లో గుజరాత్ జెయింట్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు.. శనివారం జరిగే టైటిల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. లీగ్ దశలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు నెగ్గిన ముంబై.. చివరి పోరులో బెంగళూరు చేతిలో ఓడింది. ఇక కీలక మ్యాచ్‌కు ముంబై జట్టులో ఎటువంటి మార్పులూ చేయడం లేదని సమాచారం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ దూకుడైన బ్యాటింగ్ జట్టుకు ప్లస్ కాగా.. ఆల్‌రౌండర్‌గా హేలీ మాథ్యూస్ అదరగొడుతోంది. నాట్ సివర్ బ్రంట్ ఎక్కువగా బ్యాటింగ్ భారాన్ని మోస్తోంది. షబ్నిం ఇస్మాయిల్, అమేలియా కెర్‌తోపాటు బ్రంట్ బంతితో ఆదుకొంటున్నారు. మరోవైపు గుజరాత్ కూడా దీటుగానే కనిపిస్తోంది.
ఆడిన ఎనిమిది మ్యాచ్‌లో నాలుగు నెగ్గిన జెయింట్స్ మూడో స్థానంతో నాకౌట్ బెర్త్ పట్టేసింది. బెత్ మూనీ, హర్లీన్, లిచ్‌ఫీల్డ్, ఫుల్‌మాలి.. జెయింట్స్‌కు వెన్నెముకగా నిలుస్తున్నారు. కెప్టెన్ గార్డ్‌నర్ కూడా బ్యాట్‌ను ఝళిపిస్తుండడం విశేషం. బౌలింగ్‌లో మేఘన, ప్రియా మిశ్రా, కష్వీ గౌతమ్ రాణిస్తున్నారు. లీగ్ దశలో రెండుసార్లు గుజరాత్‌పై నెగ్గిన ముంబై ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే, జెయింట్స్ ఈసారి గట్టిగా బదులు తీర్చుకోవాలనుకొంటోంది.
ఇవీ చదవండి:
ర్యాంకింగ్స్.. టాప్-5లో ముగ్గురు భారత స్టార్లు
ధోని కొత్త అవతారం.. కప్పు కోసం..
లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి