ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా జోరు.. జట్టు పరంగా, ఆటగాళ్ల పరంగా మనమే టాప్!

ABN, First Publish Date - 2023-09-20T16:05:36+05:30

తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మన వాళ్లు దుమ్ములేపారు. ఇటు జట్టు పరంగా, అటు ఆటగాళ్ల పరంగా మన వాళ్లు అదరగొట్టారు.

తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మన వాళ్లు దుమ్ములేపారు. ఇటు జట్టు పరంగా, అటు ఆటగాళ్ల పరంగా మన వాళ్లు అదరగొట్టారు. జట్టు పరంగా టెస్టులు, టీ20ల్లో టీమిండియా మొదటి స్థానంలో కొనసాతుండగా.. వన్డేల్లో రెండో స్థానంలో ఉంది. వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న పాకిస్థాన్‌తో సమానంగా టీమిండియా ఖాతాలోనూ 115 రేటింగ్ పాయింట్స్‌ ఉన్నాయి. దీంతో ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా సత్తా చాటితే నంబర్ వన్ ర్యాంకు మన సొంతమయ్యే అవకాశాలున్నాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా ఖాతాలో 264 రేటింగ్స్ పాయింట్స్ ఉన్నాయి. టెస్టుల్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు ఖాతాలో 118 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.


ఇక బ్యాటింగ్ విభాగం విషయానికొస్తే టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, టెస్టు ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. తాజాగా మహ్మద్ సిరాజ్ కూడా మొదటి స్థానానికి చేరుకున్నాడు. వన్డే బౌలింగ్ విభాగంలో ఏకంగా 8 స్థానాలు ఎగబాకిన సిరాజ్ మొదటి స్థానానికి చేరుకున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉండగా.. టెస్టు బౌలర్ల జాబితాలో జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. వన్డే బ్యాటింగ్‌ విభాగంలో శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో ఉండగా.. టీ20 ఆల్ రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఈ సారి మన వాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటారు.

Updated Date - 2023-09-20T16:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising