ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team india: అలనాటి విండీస్ దిగ్గజంతో భారత ఆటగాళ్లు.. ఏం చేశారో ఈ వీడియోలో చూడండి!..

ABN, First Publish Date - 2023-07-05T12:59:31+05:30

ప్రస్తుతం వెస్టిండీస్(West Indies) పర్యటనలో ఉన్న భారత జట్టు(Team india) ఆల్‌టైమ్ గ్రేట్ సర్ ఆల్‌‌రౌండర్ గార్ఫీల్డ్ సోబర్స్‌‌ను (Sir Garry Sobers) కలుసుకుంది. అలనాటి విండీస్ దిగ్గజ ఆటగాడిన కలిసిన భారత ఆటగాళ్లు ఆయనతో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ(BCCI) తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం వెస్టిండీస్(West Indies) పర్యటనలో ఉన్న భారత జట్టు(Team india) ఆల్‌టైమ్ గ్రేట్ సర్ ఆల్‌‌రౌండర్ గార్ఫీల్డ్ సోబర్స్‌‌ను (Sir Garry Sobers) కలుసుకుంది. అలనాటి విండీస్ దిగ్గజ ఆటగాడిన కలిసిన భారత ఆటగాళ్లు ఆయనతో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ(BCCI) తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 55 సెకన్ల ఈ వీడియోలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తోపాటు( Rahul Dravid) ఆటగాళ్లంతా గార్ఫీల్డ్ సోబర్స్‌‌ను కలుసుకున్నారు. టీమిండియా ఆటగాళ్లను కోచ్ ద్రావిడ్, సోబర్స్‌కు పరిచయం చేశాడు. కాగా భార్యతో కలిసి అక్కడికి వచ్చిన 86 ఏళ్ల గార్ఫీల్డ్ సోబర్స్‌ ఆమెను టీమిండియా ఆటగాళ్లకు పరిచయం చేశారు.

వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న బార్బడోస్ మైదానానికి సోబర్స్ వచ్చారు. దీంతో ఆయనను మొదటగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith sharma) కలుసుకున్నాడు. ఆయనతో కరచాలనం చేసి ముచ్చటించాడు. ఆయనను కులుసుకునే అద్భుత అవకాశం కల్పించినందుకు సోబర్స్‌కు హిట్‌మ్యాన్ ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత ఇతర ఆటగాళ్లను కోచ్ ద్రావిడ్.. సోబర్స్‌కు పరిచయం చేశాడు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(Rahane), విరాట్ కోహ్లీ(Virat Kohli), శుభ్‌మన్ గిల్(Gill) వరుసగా సోబర్స్‌ను కలుసుకున్నారు. కోహ్లీ నవ్వుతూ మాట్లాడుతుండగా.. విరాట్ భుజంపై సోబర్స్ చేయి వేయడం గమనార్హం. ఆ తర్వాత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను ద్రావిడ్ పరిచయం చేస్తూ.. అత్యంత ప్రతిభావంతులలో ఒకడిగా చెప్పాడు. దానికి సోబర్స్ ‘‘నేను మీ గురించి విన్నాను’’ అని చెప్పడం విశేషం. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్, రవి చంద్రన్ అశ్విన్ ఇలా ఆటగాళ్లంతా సోబర్స్‌ను కలుసుకుని కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు.

నేటి తరం క్రికెట్ అభిమానులకు గార్ఫీల్డ్ సోబర్స్‌ గురించి పెదగా తెలియకపోవచ్చు. కానీ పాత తరంలో అభిమానుల్లో ఆయన పేరు వినని వారు ఉండకపోవచ్చు. మొదటి తరం క్రికెటర్లలో గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు సోబర్స్. 1954 నుంచి 1974 మధ్య కాలంలో రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌‌లో తిరుగులేని ఆల్‌రౌండర్‌గా మన్ననలు అందుకున్నారు. 17 ఏళ్ల వయసులో వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ పేస్ ఆల్‌రౌండర్ మొదట బౌలర్‌గా రాణించారు. ఆ తర్వాత బ్యాటర్‌గానూ చెరగని ముద్ర వేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 4 ఏళ్ల తర్వాత అంటే 1958లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సోబర్స్ ట్రిబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా 375 పరుగులు బాదేశాడు. అప్పటివరకు ఒక ఆటగాడు సాధించిన అత్యధిక వ్యక్తగత స్కోర్ అదే. ఈ రికార్డు 40 ఏళ్లపాటు సోబర్స్ పేరు మీదనే ఉన్నది. క్రికెట్‌లో మొట్ట మొదటగా ఒకే ఓవర్లో 6 సిక్సులు కొట్టింది కూడా సోబర్సే. 1968లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సోబర్స్ ఈ ఘనత సాధించాడు. ఇక తన కెరీర్లో వెస్టిండీస్ తరఫున 93 టెస్ట్ మ్యాచ్‌లాడిన సోబర్స్ 57 సగటుతో 8032 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక బౌలింగ్‌లో 235 వికెట్లు పడగొట్టాడు. ఇక తన కెరీర్లో సోబర్స్ ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడాడు.

Updated Date - 2023-07-05T12:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising