ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Neeraj Chopra: భారత్- పాకిస్థాన్ మధ్య తేడా ఇదే అంటున్న నెటిజన్‌లు

ABN, First Publish Date - 2023-08-28T14:03:12+05:30

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరు ముగిసిన తర్వాత కాంస్యం నెగ్గిన చెక్ రిపబ్లిక్ అథ్లెట్ వాద్లెచ్‌తో కలిసి నీరజ్ చోప్రా ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సందర్భంగా అతడు చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంది. 87.82 మీటర్ల దూరం విసిరి రజతం నెగ్గిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను కూడా ఫోటో దిగేందుకు నీరజ్ చోప్రా పిలిచాడు. అయితే అక్కడే ఉన్న నదీమ్.. తన దేశం జెండా కూడా పట్టుకోకుండానే నీరజ్ పక్కన నిలబడ్డాడు. వెనుకాల మువ్వన్నెల జెండాను పట్టుకుని నదీమ్‌ను ఆప్యాయంగా పిలిచినందుకు నెటిజన్లు నీరజ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2023లో జావెలిన్ త్రో విభాగంలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరి బంగారు పతకం సాధించాడు. దీంతో వరల్డ్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నీరజ్‌ చోప్రా నిలిచాడు. అయితే పాకిస్థాన్ అథ్లెట్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఫైనల్ పోరు ముగిసిన తర్వాత తన విజయాన్ని దేశానికి అంకితం ఇస్తున్నట్లు నీరజ్ చోప్రా ప్రకటించాడు. ఈ పోరును భారత్-పాకిస్థాన్ పోరులా అభిమానులు భావించి ఉంటారని.. అందుకే తాను అత్యుత్తమంగా పోరాడినట్లు పేర్కొన్నాడు.

తాను పోటీకి ముందు ఎక్కువగా మొబైల్‌ ఫోన్‌ వాడను. కానీ ఎందుకో ఈ రోజు ఫోన్‌ చూడగా అందులో మొదటగా భారత్‌ వర్సెస్ పాకిస్థాన్‌ అని కనిపించిందని నీరజ్ చోప్రా తెలిపాడు. కానీ ఇక్కడ యూరోపియన్‌ అథ్లెట్లు చాలా ప్రమాదకరమని వివరించాడు. ఏ సమయంలోనైనా వారు పెద్ద త్రో చేయగలరన్నాడు. అర్షద్‌ మాత్రమే కాదు.. జాకుబ్‌, జూలియన్‌ వెబర్‌ కూడా ఉన్నారని.. చివరి త్రో వరకూ ఇతర త్రోయర్ల గురించి ఆలోచిస్తూ ఉండాలన్నాడు. కానీ స్వదేశంలో మాత్రం దీన్ని భారత్‌-పాక్ మ్యాచ్‌గా చూస్తారని నీరజ్ చోప్రా తెలిపాడు. భారతీయులకు కష్టపడటమే తెలుసు అని.. అందుకే తన విజయం తన దేశ ప్రజలకు అంకితం ఇచ్చానని వివరించాడు. భారత్‌కు మరో పతకం అందించినందుకు గర్వంగా ఉందన్నాడు. జావెలిన్ త్రోలో 90 మీటర్ల మార్క్ అందుకోవడమే తన తదుపరి లక్ష్యమని నీరజ్ చోప్రా చెప్పాడు. భవిష్యత్‌లో ఇది సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. అయితే 90 మీటర్ల లక్ష్యం అందుకోవడం కంటే దేశానికి పతకాలు సాధించడాన్నే గొప్పగా భావిస్తానని నీరజ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.


కాగా కాంస్యం నెగ్గిన చెక్ రిపబ్లిక్ అథ్లెట్ వాద్లెచ్‌తో కలిసి నీరజ్ చోప్రా ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సందర్భంగా అతడు చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంది. 87.82 మీటర్ల దూరం విసిరి రజతం నెగ్గిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను కూడా ఫోటో దిగేందుకు నీరజ్ చోప్రా పిలిచాడు. అయితే అక్కడే ఉన్న నదీమ్.. తన దేశం జెండా కూడా పట్టుకోకుండానే నీరజ్ పక్కన నిలబడ్డాడు. వెనుకాల మువ్వన్నెల జెండాను పట్టుకుని నదీమ్‌ను ఆప్యాయంగా పిలిచినందుకు నెటిజన్లు నీరజ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటు ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించిన నీరజ్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు నీరజ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. నీరజ్‌ చోప్రాది అసమాన ప్రతిభ అని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా కొనియాడారు. అంకితభావం, కచ్చితత్వం, ఆటపై మక్కువ నీరజ్‌ను ఛాంపియన్‌గా నిలిపాయని మోదీ అన్నారు.

Updated Date - 2023-08-28T14:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising