Viral Video: కెమెరామెన్‌గా మారిన ఇషాన్ కిషన్.. విండీస్ పర్యటనలో టీమిండియా ఏం చూస్తుందో చూడండి!..
ABN, First Publish Date - 2023-07-04T12:54:50+05:30
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) కాసేపు కెమెరామెన్‌గా మారాడు. టీమిండియా (Team india) ఆటగాళ్లు బీచ్‌లో వాలీబాల్ ఆడుతుంటే ఇషాన్ కిషన్ వీడియో చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ(BCCI) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) కాసేపు కెమెరామెన్‌గా మారాడు. టీమిండియా (Team india) ఆటగాళ్లు బీచ్‌లో వాలీబాల్ ఆడుతుంటే ఇషాన్ కిషన్ వీడియో చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ(BCCI) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే వెస్టిండీస్‌లో(West Indies) అడుగుపెట్టింది. ఈ క్రమంలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆటగాళ్లంతా బార్బడోస్ సముద్ర తీరంలో సరాదాగా వాలీబాల్ ఆడారు. ఈ వాలీబాల్ సెషన్‌లో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌తోపాటు (Virat Kohli, Ravichandran Ashwin, Rahul Dravid) దాదాపు ఆటగాళ్లంతా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన నిమిషం 46 సెకన్ల వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో టీమిండియా.. వెస్టిండీస్ చేరుకున్న విజువల్స్‌తోపాటు బార్బడోస్ బీచ్ అందాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ బీచ్‌లో టీమిండియా ఆటగాళ్లంతా చురుకుగా వాలీబాల్ ఆడుతున్నారు. ఈ క్రమంలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కాసేపు కెమెరామెన్‌గా మారాడు. టీమిండియా ఆటగాళ్లు ఆడుతున్న వాలీబాల్(volleyball) ఆటను తన మొబైల్ కెమెరాలో చిత్రీకరించాడు. ఈ వీడియో చూసిన అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ నెల 12 నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (World Test Championship) మ్యాచ్ కోసం వారం రోజుల ముందు మాత్రమే ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనకు మాత్రం 10 రోజుల ముందుగానే అక్కడికి చేరుకోవడం గమనార్హాం. కాగా ఈ సిరీస్‌తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-2025 సైకిల్‌లో టీమిండియా జర్నీ ప్రారంభంకానుంది. దీంతో వీలైనంత త్వరగా డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి నుంచి బయటపడి మళ్లీ విజయాల బాట పట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. పైగా మరో 3 నెలల్లోనే వన్డే వరల్డ్ కప్ కూడా ఉండడంతో ఇకపై టీమిండియా ఎలా ఆడబోతుందనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
Updated Date - 2023-07-04T12:54:50+05:30 IST