Virat Kohli: ఒక్క ఇన్‌స్టా పోస్టుకు రూ.11.45 కోట్లు.. ఖండించిన కోహ్లీ.. అసలు ఏమన్నాడంటే..?
ABN, First Publish Date - 2023-08-12T16:14:07+05:30
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఒక పోస్టు పెట్టడానికి ఏకంగా రూ.11.45 కోట్లు తీసుకుంటున్నాడని హోపర్ హెచ్‌క్యూ(Hopper HQ) అనే సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఒక పోస్టు పెట్టడానికి ఏకంగా రూ.11.45 కోట్లు తీసుకుంటున్నాడని హోపర్ హెచ్‌క్యూ(Hopper HQ) అనే సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వార్తలపై శనివారం విరాట్ కోహ్లీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా వేదికగా స్పందించాడు. హోపర్ హెచ్‌క్యూ అనే సంస్థ చెప్పిన వివరాల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ‘‘జీవితంలో నేను అందుకున్న ప్రతిదానికి రుణపడి ఉంటాను. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అయితే నా సోషల్ మీడియా సంపాదన గురించి ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదు’’ అని తన ట్విట్టర్ ఖాతాలో కోహ్లీ రాసుకొచ్చాడు. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కల్గి ఉన్న భారత ఆటగాడు విరాట్ కోహ్లీనే కావడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీకి ఏకంగా 25.5 కోట్ల ఫాలోయర్లు ఉన్నారు.
అసలు శుక్రవారం హోపర్ హెచ్‌క్యూ అనే సంస్థ ఏం చెప్పిదంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో 25.5 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్న విరాట్ కోహ్లీ ఒక్కో పోస్టుకు ఏకంగా రూ. 11.45 కోట్లు తీసుకొంటున్నాడు. ఈ జాబితాలో 59.6 కోట్ల మంది ఫాలోయర్లున్న పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఒక్కో పోస్టుకు రూ. 26.75 కోట్లు తీసుకుంటూ టాప్‌లో నిలిచాడు. 47.9 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్న అర్జెంటీనా ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ రూ. 21.49 కోట్లతో రెండో స్థానం దక్కించుకొన్నాడు. అయితే హోపర్ హెచ్‌క్యూ వెల్లడించిన వివరాలను విరాట్ కోహ్లీ ఖండించడంతో రోనాల్డో, మెస్సీ ఇన్‌స్టా పోస్టులకు సంబంధించిన ఆదాయం గురించిన వివరాలు కూడా ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-08-12T16:15:20+05:30 IST