ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL 2024: హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వదిలి ముంబైలో చేరడం వెనకున్న అసలు కారణమిదేనా..?

ABN, First Publish Date - 2023-11-27T13:19:04+05:30

Hardik pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(ఐపీఎల్ 2024) ప్రారంభం కావడానికి ఇంకా 5 నెలల సమయం ఉంది. కానీ అప్పుడే ఈ లీగ్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. టోర్నీ కోసం నిర్వహించే వేలానికి ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(ఐపీఎల్ 2024) ప్రారంభం కావడానికి ఇంకా 5 నెలల సమయం ఉంది. కానీ అప్పుడే ఈ లీగ్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. టోర్నీ కోసం నిర్వహించే వేలానికి ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా తన పాత జట్టైనా ముంబై ఇండియన్స్‌లో చేరనున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 19న ఐపీఎల్ వేలాన్ని నిర్వహించనున్నారు. అంతకుముందే ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి, ట్రేడింగ్ చేసుకోవడానికి ఫ్రాంచైజీలకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రిటెన్షన్ గడువు ఆదివారంతో ముగిసింది.

హార్దిక్ పాండ్యా తమతోనే ఉన్నాడని గుజరాత్ టైటాన్స్ జట్టు సాయంత్రం సమర్పించిన రిటైన్షన్ జాబితాలో చూపించింది. దీంతో హార్దిక్ ముంబై జట్టులో చేరబోతున్నాడని వార్తలు పుకార్లేనని అంతా భావించారు. కానీ రాత్రికి రాత్రే మళ్లీ సీన్ రివర్సైంది. ట్రేడింగ్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. దీంతో ఉదయం లేచే సరికి రాత్రి జరిగిన ఈ నాటకీయ పరిణామాలు అందరినీ షాక్‌కు గురి చేశాయి. ఇందుకుగాను హార్దిక్ పాండ్యా జీతం రూ.15 కోట్లను గుజరాత్‌కు ముంబై ఇండియన్స్ చెల్లించనుందట. అంతేకాకుండా టైటాన్స్‌కు పెద్ద మొత్తంలో ‘బదిలీ రుసుము’ చెల్లించేందుకు కూడా ముంబై సిద్ధమైనట్టు తెలిసింది. కాగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రిటెన్షన్ గడువు ముగిసినప్పటికీ ట్రేండింగ్ విండో గడువు ఇంకా మిగిలింది. దీంతో ఈ సమయంలో రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్లను కూడా రెండు జట్ల ఏకాభిప్రాయంతో అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది.


ఏమైనా జరగొచ్చు

మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే వేలానికి తగు మొత్తం సమకూర్చుకొనేందుకు గాను గత సీజన్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన తమ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ను రూ.17.5 కోట్ల మొత్తానికి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ముంబై ఇండియన్స్ అమ్మేసింది. అలాగే మరో 10 మంది ఆటగాళ్లను ముంబై వేలంలోకి వదిలేసింది. ఇక హార్దిక్ పాండ్యాకు రూ.15 కోట్లతోపాటు అనధికారికంగా మరింత డబ్బు ముట్టనుందని సమాచారం. అయితే ఇదంతా కచ్చితమని ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇటు ముంబై ఇండియన్స్ నుంచి కానీ, అటు గుజరాత్ టైటాన్స్ నుంచి కానీ ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పైగా ట్రెండింగ్ విండో తుది గడవు డిసెంబర్ 12 వరకు ఉంది. దీంతో అప్పటివరకు ఏమైనా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే గుజరాత్ టైటాన్స్‌ను విజయవంతంగా నడిపించిన హార్దిక్ పాండ్యా ఆ ఫ్రాంచైజీని విడడానికి గల కారణమేంటనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయి. ఆడిన రెండు సీజన్లలో జట్టును ఫైనల్ చేర్చిన కెప్టెన్‌ను గుజరాత్ మాత్రం ఎలా వదులుకుందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే ఇందుకుగల కారణాలపై పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ తమ కథనాల్లో ఆసక్తికర విషయాలను తెలిపాయి.

గుజరాత్‌ను వీడడానికి గల కారణం

పలు జాతీయ మీడియాల కథనాల ప్రకారం ఆర్థిక లావాదేవీల విషయంలో వచ్చిన విబేధాలే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వీడడం వెనుకున్న ప్రధాన కారణంగా తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా తన ఫీజ్ పెంచాలని గుజరాత్ మేనేజ్‌మెంట్‌ను అడిగాడట. అలాగే తన కోసం ప్రత్యేకంగా బ్రాండింగ్ అవకాశాలు ఇవ్వాలని కూడా కోరాడట. ఈ క్రమంలోనే గుజరాత్ యజమాన్యానికి, హార్దిక్ పాండ్యాకు మధ్య విబేధాలు తలెత్తినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ విభేదాలు గత ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాతి నుంచి ప్రారంభమయ్యాయని సమాచారం. ఈ క్రమంలోనే తనకు గతంలో కలిసొచ్చిన ముంబై ఇండియన్స్ జట్టులో చేరాలని హార్దిక్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో ఈ విషయాన్ని గుజరాత్ మేనేజ్‌మెంట్‌కు చెప్పాడట. అప్పటికే హార్దిక్‌తో విబేధాలు కొనసాగుతుండడంతో గుజరాత్ మేనేజ్‌మెంట్ కూడా అతని నిర్ణయానికి అడ్డు చెప్పలేదని సమాచారం. దీంతో స్వయంగా పాండ్యానే ఈ ట్రేడింగ్ ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రపంచకప్ మొదలవడానికి ముందే ముంబై ఇండియన్స్ జట్టు మేనేజ్‌మెంట్‌తో హార్దిక్ పాండ్యా చర్చలు జరిపాడని సమాచారం. నిజానికి మేనేజ్‌మెంట్‌తో అంతగా విభేదాలు ఉంటే హార్దిక్ వేలానికి వెళ్లొచ్చు. అప్పుడు అతన్ని ఏ జట్టైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ అతను మాత్రం ముంబై ఇండియన్స్ జట్టులోనే ఆడాలని నిర్ణయించుకున్నాడని తెలిసింది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ముంబై ఇండియన్స్‌లో చేరాకే హార్దిక్ పాండ్యాకు క్రికెటర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. ముంబైలోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. పైగా ముంబై జట్టులో ఉన్న పరిస్థితులన్నింటికి హార్దిక్ పాండ్యా తనకు చాలా సౌకర్యవంతంగా ఉన్నట్టు భావిస్తున్నాడని సమాచారం. పైగా గతంలో చాలా కాలం ఆ ఫ్రాంచైజీకి ఆడడంతో అక్కడి పరిస్థితులన్నింటికీ కూడా బాగా అలవాటుపడ్డాడు. అందుకే అతను ముంబై ఇండియన్స్‌లోనే ఆడాలని నిర్ణయించుకున్నాడని సమాచారం.

కెప్టెన్ అవుతాడా?

హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులో చేరినప్పటికీ ఈ సీజన్‌లో కెప్టెన్సీ దక్కే అవకాశాలు లేవు. ఈ సీజన్‌లో కూడా రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉంటాడని ఇప్పటికే ఆ జట్టు మేనేజ్‌మెంటు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 36 సంవత్సరాలు. హార్దిక్ పాండ్యా వయసు 30 సంవత్సరాలు. వయసు రీత్యా వచ్చే 2025లో రోహిత్ శర్మ జట్టులో ఉన్నప్పటికీ కెప్టెన్సీ చేసే అవకాశలు లేకపోవచ్చు. దీంతో హార్దిక్‌కు 2025 వరకు కానీ కెప్టెన్సీ దక్కే అవకాశాలు లేవు. ఈ సీజన్‌లో జట్టులో సాధారణ ఆటగాడిగానే కొనసాగనున్నాడు. హార్దిక్ కూడా దీనికి సిద్దపడే ముంబైలో చేరినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం టీమిండియాకు కెప్టెన్లుగా ఉన్న ఇద్దరు ఆటగాళ్లు ఒకే జట్టులో ఉండడం మాత్రం ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-11-27T13:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising