World Cup 2023: సిక్స్‌తో ప్రారంభమైన వరల్డ్ కప్.. తొలి బౌండరీ, తొలి వికెట్ తీసింది వీళ్లే!
ABN, First Publish Date - 2023-10-05T15:35:18+05:30
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమైంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించింది.
అహ్మదాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమైంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రపంచకప్‌లో మొదటి ఓవర్‌ను న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్డ్ వేశాడు. మొదటి బంతిని ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ఎదుర్కొన్నాడు. మొదటి బంతి డాట్ కాగా రెండో బంతిని బెయిర్‌స్టో సిక్సర్ బాదాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌నకు సిక్సర్‌తో అదిరిపోయే ఆరంభం లభించింది. అది కూడా ప్రపంచకప్‌లో రెండో బంతినే కావడం గమనార్హం. దీంతో ప్రపంచకప్‌నకు సిక్సర్‌తో ఘనమైన ఆరంభం ఇవ్వడమే కాకుండా, ఈ సారి తొలి సిక్సర్ బాదిన ఆటగాడిగా బెయిర్ స్టో చరిత్ర సృష్టించాడు. అదే ఓవర్ మూడో బంతికి సింగిల్ తీశాడు. ఐదో బంతికి ఫోర్ బాది ఈ వరల్డ్ కప్‌లో తొలి బౌండరీ నమోదు చేశాడు. దీంతో ఈ వరల్డ్ కప్‌లో తొలి సిక్సర్, తొలి ఫోర్, తొలి సింగిల్ తీసిన బ్యాటర్‌గా బెయిర్ స్టో నిలిచాడు. మ్యాట్ హెన్రీ వేసిన రెండో ఓవర్ మెయిడెన్ అయింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో అప్పుడే తొలి మెయిడెన్ ఓవర్ కూడా నమోదైంది. 2023 ప్రపంచకప్‌లో వేసిన మొదటి ఓవర్‌నే మెయిడెన్ చేసిన బౌలర్‌గా, ఈ ప్రపంచకప్‌లో తొలి మెయిడెన్ ఓవర్ వేసిన బౌలర్‌గా మ్యాట్ హెన్రీ నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో తొలి రెండు పరుగులను ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్ సాధించాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో తొలి వికెట్ తీసిన బౌలర్‌గా పేసర్ మ్యాట్ హెన్రీ నిలిచాడు. 8వ ఓవర్ నాలుగో బంతికి డేవిడ్ మలాన్‌ను హెన్రీ పెవిలియన్ చేర్చాడు. మలాన్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ టామ్ లాథమ్ అందుకున్నాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో తొలి క్యాచ్ అందుకున్న బౌలర్‌గా లాథమ్ నిలిచాడు.
తుది జట్లు
ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్/వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్
Updated Date - 2023-10-05T15:35:18+05:30 IST