ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup: 48 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ కుర్రాడు.. సచిన్ రికార్డు బద్దలు

ABN, First Publish Date - 2023-11-04T14:42:48+05:30

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్రకు ఇది మూడో సెంచరీ.

బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్రకు ఇది మూడో సెంచరీ. దీంతో 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో చరిత్రలో 25 ఏళ్ల లోపు వయసులోనే అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు చేశాడు. సచిన్ తన 25 ఏళ్ల లోపు వయసులో రెండు సెంచరీలు చేశాడు. సచిన్ 1996 ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించాడు. అప్పుడు మాష్టర్ వయసు 22 ఏళ్ల 313 రోజులు మాత్రమే. తాజాగా 3 సెంచరీలు పూర్తి చేసుకున్న రచిన్ రవీంద్ర వయసు 23 ఏళ్ల 351 రోజులు మాత్రమే. అలాగే 25 ఏళ్ల లోపు వయసులోనే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌తో కలిసి రవీంద్ర మొదటి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరు సమానంగా 523 పరుగుల చొప్పున చేశారు. కాగా ఈ ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్ర ఇప్పటికే 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. అంతేకాకుండా ఆడిన తొలి ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా కూడా రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. అలాగే ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు బాదిన కివీస్ బ్యాటర్‌గా కూడా రచిన్ రవీంద్ర రికార్డు నెలకొల్పాడు.


న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఈ మ్యాచ్‌లో రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్జుకున్న విలియమ్సన్ వన్డే ప్రపంచకప్ చరిత్రలో 1,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో కివీస్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. విలియమ్సన్ కంటే ముందు స్టీఫెన్ ఫ్లెమింగ్, రాస్ టేలర్ ఈ ఘనత సాధించారు. అయితే కివీస్ తరఫున వేగంగా 1,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఫ్లెమింగ్ 33 ఇన్నింగ్స్‌ల్లో, టేలర్ 30 ఇన్నింగ్స్‌ల్లో, విలియమ్సన్ 24 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కు అందుకున్నారు. అలాగే ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా విలియమ్సన్(1076) నిలిచాడు. కాగా గాయం తర్వాత కోలుకుని ఈ మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఎచ్చిన విలియమ్సన్ 95 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో సత్త చాటాడు.

Updated Date - 2023-11-04T14:42:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising