AP and Telangana : టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..
ABN, First Publish Date - 2023-02-09T12:45:19+05:30
ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఢిల్లీ : ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణలో సయ్యద్ అస్సాన్ జాఫ్రి ఎమ్మెల్సీ పదవి కాలం ముగిస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్ వెలువడింది. ఇక ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇక రెండు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ తేదీతో పాటు ఎన్నికల తేదీ, ఫలితాల తేదీ ఒకే రోజున ఉండబోతోంది. కాగా.. తెలంగాణలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి పరిధిలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఏపీలో 13 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
రెండు తెలుగు రాష్ట్రాల షెడ్యూల్...
నోటిఫికేషన్ తేదీ ఫిబ్రవరి 16
ఎన్నికల తేదీ మార్చి 13
ఎన్నికల ఫలితాలు తేదీ మార్చి 16
టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు:
1. ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు
2. కడప - అనంతపురం - కర్నూలు
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు:
1. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు
2. కడప- అనంతపురం- కర్నూలు
3. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం
Updated Date - 2023-02-09T12:45:22+05:30 IST