Share News

Actress DivyaVani: కాంగ్రెస్‌లో చేరికల జోష్.. హస్తం పార్టీలో చేరిన దివ్యవాణి

ABN , First Publish Date - 2023-11-22T11:47:00+05:30 IST

Telangana Elections: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోష్ పెరిగింది. ఇప్పటికే విజయశాంతి వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్‌‌ కండువా కప్పుకున్నారు.

Actress DivyaVani: కాంగ్రెస్‌లో చేరికల జోష్.. హస్తం పార్టీలో చేరిన దివ్యవాణి

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో మరింత చేరికల జోష్ పెరిగింది. ఇప్పటికే విజయశాంతి (Vijayashanti) వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరగా తాజాగా ప్రముఖ నటి దివ్యవాణి (Actress Divya Vani) కాంగ్రెస్‌‌ కండువా కప్పుకున్నారు.

బుధవారం ఉదయం ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే (AICC in-charge Manik Rao Thackeray) సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఎన్నికల ముందు చేరికలు పెరగడంతో కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ నింపింది. మొన్న విజయశాంతి.. నేడు దివ్యవాణి కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీకి సినీ గ్లామర్ వచ్చి చేరుతోందని హస్తం శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


కాంగ్రెస్‌లో చేరిక తర్వాత దివ్యావాణి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతోందన్నారు. ప్రజల కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు. తనకు పదవి ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఎలాంటి బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తానని, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని దివ్యవాణి చెప్పారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-22T12:24:22+05:30 IST