ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amit Shah : కేసీఆర్‌పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు

ABN, First Publish Date - 2023-11-24T23:22:07+05:30

కేసీఆర్‌ ( KCR ) పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) అన్నారు.

హైదరాబాద్: కేసీఆర్‌ ( KCR ) పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ ముఖ్య నేతలు కిషన్‌రెడ్డి, ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్‌లతో అమిత్ షా సమావేశం అయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నేతలతో అమిత్ షా చర్చించారు...ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ...‘‘ బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ అంశాలు ప్రజల్లోకి వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ల పాలనను సైతం ప్రజలకు గుర్తు చేద్దాం.భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. రోడ్, పబ్లిక్ మీటింగ్స్‌లో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. రానున్న నాలుగు రోజులు ప్రచారాన్ని ఉధృతం చేయండి. బీసీ ముఖ్యమంత్రి అంశం, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం’’ అని అమిత్ షా తెలిపారు.

Updated Date - 2023-11-24T23:22:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising