ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పైరవీ, దళారుల రాజ్యమే

ABN, First Publish Date - 2023-11-24T18:44:18+05:30

బీఆర్ఎస్ ( BRS ) పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ( CM KCR ) వ్యాఖ్యానించారు.

ములుగు : బీఆర్ఎస్ ( BRS ) పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ( CM KCR ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ములుగులో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ...‘‘మేడారం జాతరను మరింత అభివృద్ధి చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడూ నన్ను కలిసింది లేదు.. అడిగింది లేదు. మీ కష్టాలు తెలుసుకొని నేనే అన్నీ ఇచ్చాను. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేను ఓడించినా ఇచ్చిన మాట కోసం జిల్లా ములుగును చేశాను. ఈసారి మీరు మాట నిలబెట్టుకోవాలి.. లేకుంటే నేను అలుగుతా.. పంచాయతీ పెట్టుకుంటా.. జనం కోసం నాగజ్యోతి తండ్రి ఉద్యమంలోకి పోయి అమరుడైండు.. ఆ బిడ్డకు తల్లీ, తండ్రీ మీరే. నాగజ్యోతి గెలిస్తే ములుగు జ్యోతిలా వెలుగుతుంది. మెడికల్ కాలేజీ ఇచ్చాం.. 48161ఎకరాకు పోడు పట్టాలు ఇచ్చాం. ఏటూరునాగారంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పైరవీ, దళారుల రాజ్యమే వస్తుంది. ధరణిని బంగాళఖాతంలో వేస్తే రైతులకు రైతుబంధు ఎలా వస్తుంది. మళ్లీ పట్వారీ, వీఆర్వో వ్యవస్థను కాంగ్రెస్ తెస్తుంది. పార్టీ చరిత్ర, అభ్యర్థి చరిత్రను చూసి ఓట్లేయండి. సింగరేణిని కేంద్రానికి అమ్ముకున్నది కాంగ్రెస్‌‌ ప్రభుత్వమే’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-24T18:45:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising