CM KCR: కిరణ్ కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగినా.. టీ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు..?
ABN, First Publish Date - 2023-11-27T18:06:27+05:30
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ( Kiran Kumar Reddy ) సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగినా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రశ్నించారు. సోమవారం నాడు జోగిపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ( Kiran Kumar Reddy ) సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగినా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రశ్నించారు. సోమవారం నాడు జోగిపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...‘‘ కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వనని అంటే..ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన రాజీనామా చేశారా.. అదే సభలో దామోదర రాజానర్సింహా ముసి ముసి నవ్వులు నవ్వలేదా అని నిలదీశారు.తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. సింగూర్ నీళ్లు అప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
అప్పుడు ఇక్కడ ఉన్న మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎందుకు మాట్లాడలేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతుబంధు వృథా అని అంటున్నాడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు అభివృద్ధి చేయడం చాతకాలేదని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసివేసి, భూమాత అని పెడుతారట.. అది భూమాతనా.? భూ మేతనా..? అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలకు ఢిల్లీ, హైదరాబాద్‌కి తిరగడానికే సరిపోతుందని దెప్పిపొడిశారు. ఇందిరమ్మ రాజ్యం అంత ఆకలి రాజ్యమే.. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలని అని నిలదీశారు. ధరణి అనేది రైతులకు శ్రీరామ రక్ష లాంటిది అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ప్రజలకు తెలుసు..కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-27T18:52:49+05:30 IST