ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi: కాంట్రాక్ట్ కార్మికులతో రాహుల్.. వారి సమస్యలు వింటూ..

ABN, First Publish Date - 2023-11-28T11:59:40+05:30

Telangana Elections: ఖైరతాబాద్‌లో కాంట్రాక్ట్ కార్మికులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. తాము పడుతున్న బాధలు, సమస్యలను రాహుల్‌కు కాంట్రాక్ట్ కార్మికులు చెప్పుకున్నారు. డ్రైవర్స్, డెలివరీ బాయ్స్, శానిటరీ వర్కర్లు, హెల్త్ వర్కర్లతో కాంగ్రెస్ అగ్రనేత ముఖాముఖి నిర్వహించారు.

హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కాంట్రాక్ట్ కార్మికులతో (contract workers) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. తాము పడుతున్న బాధలు, సమస్యలను రాహుల్‌కు కాంట్రాక్ట్ కార్మికులు చెప్పుకున్నారు. డ్రైవర్స్, డెలివరీ బాయ్స్, శానిటరీ వర్కర్లు, హెల్త్ వర్కర్లతో కాంగ్రెస్ అగ్రనేత ముఖాముఖి నిర్వహించారు. డెలివరీ బాయ్స్ తమ కష్టాలు మొరపెట్టుకున్నారు. రోజుకు ఎంత డబ్బు వస్తుందని రాహుల్ ఆరా తీశారు. తమకు టూ వీలర్స్ ఇప్పించాలని, పెట్రోల్ రేట్ తగ్గించాలని డెలివరీ బాయ్స్ కోరారు. అటు సానిటరీ వర్కర్లు, హెల్త్ వర్కర్లు కూడా తమ సమస్యలను రాహుల్ ముందు ఏకరుపెట్టారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంత కష్టపడినా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల కొద్దీ పని చేసినా తగినంత వేతనం రావడం లేదని సానిటరీ వర్కర్లు చెప్పుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా పర్మినెంట్ చేయలేదని తెలిపారు. తమపై దయచూపి పర్మినెంట్ చేయాలని రాహుల్‌కు సానిటరీ వర్కర్లు వినతి చేశారు.


తెలంగాణ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కాంట్రాక్ట్ వర్కర్లు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వచ్చాక తమ సమస్యలు తీర్చాలని రాహుల్ గాంధీని కోరారు. గత పదేళ్లుగా తమ సమస్యలు తీరడం లేదని క్యాబ్ డ్రైవర్లు తెలిపారు. సంక్షేమ ఫలాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే అందుతున్నాయని అన్నారు. సంపాదించింది అంతా పెట్రోల్, డీజిల్‌కే పోతోందని.. చలానాలతో ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని ఆటో డ్రైవర్లు వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మీ అందరి సమస్యలపై సీఎంతో మాట్లాడుతానని.. అన్నింటినీ పరిష్కరిస్తామని కాంట్రాక్ట్‌ కార్మికులకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-28T12:16:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising