Telangana Election Results: తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఎక్కడ చూడాలి?
ABN , First Publish Date - 2023-12-02T19:48:54+05:30 IST
Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు తెలియజేయనుంది. ఈ మేరకు https: //results.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 30న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈసీ అధికారులు ఎన్నికలను నిర్వహించగా డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనుండగా.. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను పోలింగ్ సిబ్బంది లెక్కిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా అందించనుంది. www.andhrajyothy.com ద్వారా ప్రత్యేక కథనాలను అందించనుంది. ఉదయం 5:30 గంటల నుంచే ఎన్నికల ఫలితాలపై అటు టీవీలో, ఇటు వెబ్‌సైట్‌లో స్పెషల్ స్టోరీలను ప్రసారం చేయనుంది. మరోవైపు ఈసీ కూడా ఎన్నికల ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు తెలియజేయనుంది. ఈ మేరకు https://results.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించనున్నారు.
కాగా 119 నియోజకవర్గాలకు నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో రాత్రి 11 గంటల వరకు చాలా ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగిసినా క్యూలైన్‌లలో ఓటర్లు ఉండటంతో ఎన్నికల అధికారులు వాళ్లకు ఓటు వేసే హక్కును కల్పించారు. మొత్తంగా రాష్ట్రంలో 70.6 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. జనగామలో అత్యధికంగా 83.34 శాతం, నర్సంపేటలో 83 శాతం, దుబ్బాకలో 82.75 శాతం పోలింగ్ నమోదైంది. అయితే అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేయగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి నుంచి పోటీ చేశారు. అటు బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజురాబాద్, గజ్వేల్ నుంచి బరిలో నిలిచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.