ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Elections: నగదు బదిలీపై ఐటీ - ఈడీ సీరియస్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు

ABN, First Publish Date - 2023-11-21T10:44:16+05:30

తెలంగాణలో ఎన్నికల వేళ భారీగా నగదు బదిలీపై ఐటీ - ఈడీ సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 30 చోట్ల ఏకకాలంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల (Telangana Elections) వేళ భారీగా నగదు బదిలీపై ఐటీ - ఈడీ సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 30 చోట్ల ఏకకాలంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతలతో పాటు ప్రముఖ వ్యాపారుల లావాదేవీలపై ఐటీ విచారణ చేపట్టింది. తెలంగాణలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ (BRS leader and former market committee chairman Kasam Srinivas) నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు (MLA Koneru Konappa) శ్రీనివాస్ సన్నిహితునిగా ఉన్నారు.


మరోవైపు మంచిర్యాలలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ (Chennuru Congress candidate and former MP Vivek)నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీగా నగదు బదిలీ అయిందన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థల ఖాతాల్లోకి రూ.8కోట్ల నగదు బదిలీ జరిగింది. గుర్తు తెలియని ఖాతా నుంచి నగదు బదిలీపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రూ.8కోట్ల నగదును ఫ్రీజ్ చేసి ఈసీ, ఐటీ, ఈడీ అధికారుల దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులిచ్చిన సమాచారం ఆధారంగా వివేక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చెన్నూరులో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వివేక్‌, వినోద్‌ నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ రైడ్ జరుగుతోంది.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-21T11:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising