Karimnagar CP: బయటి వారు ఇక్కడ ఉండొద్దు...
ABN , First Publish Date - 2023-11-29T10:15:05+05:30 IST
Telangana Elections: తెలంగాణ ఎన్నికలకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. నిన్నటి ఎన్నికల ప్రచారానికి తెరపడింది.
కరీంనగర్: తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections) ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. నిన్నటి ఎన్నికల ప్రచారానికి తెరపడింది. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే పోలీసులు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సీపీ అభిషేక్ మహంతి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మాట్లాడుతూ... బయటి వారు ఇక్కడ ఉండొద్దని ఆదేశించారు. అన్ని హోటల్స్ తనిఖీ చేస్తున్నామని అన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం, డబ్బుల పంపిణీపై గట్టి నిఘా పెట్టామన్నారు. కమిషనరేట్ పరిధిలో డేగ కళ్లతో నిఘా పెట్టిన సీపీ అభిషేక్ మహంతి వెల్లడించారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి