ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy : ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ ధ్వంసం చేసింది

ABN, First Publish Date - 2023-11-22T21:10:14+05:30

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఇన్నేళ్ల తర్వాత బీసీలకు మేలు చేసేందుకు సీఎంని చేయాలని బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంది. బీసీ సంఘాలు సమావేశం అయిన తర్వాత మాకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ సాధనలో బీసీ ఉద్యమాలు చేసిన తరహాలో బీసీని సీఎం చేసేందుకు ముందుకు వస్తున్నారు. బీజేపీ పార్టీకి అత్యధిక బీసీ ఎమ్మెల్యేలు, 27మంది కేంద్ర మంత్రులు బీసీలే ఉన్నారు. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలను బీజేపీ రాష్ట్రపతిలను చేసింది. కాంగ్రెస్ ఏనాడూ చిత్తశుద్దితో సామాజిక న్యాయం కోసం పని చేయలేదు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా దళితుడిని సీఎం చేస్తారా..? కుమారుడు సీఎం, మనవడు ప్రధాని అయినట్టు కేసీఆర్ ఫాంహౌస్‌లో కలలు కుంటున్నాడు’’ అని కిషన్‌రెడ్డి సెటైర్లు వేశారు.


తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కృషి

‘‘రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. గతంలో బీసీ సంఘాల నేతలు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే, మంత్రి కావాలని కోరుకునేవారు. ఇప్పుడు బీజేపీ అదే చేస్తుంది.. బీసీని ముఖ్యమంత్రి చేస్తుంది. కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కలలు కంటుంది. తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందు జేఏసీలో చేరిన తెలంగాణ కోసం బీజేపీ తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్.. ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ఉంటే అక్కడ అవినీతే ఉంటుంది. కాంగ్రెస్ అవినీతిని పెంచి పోషించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఓ ముఖ్యమంత్రి వస్తాడు. ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ ధ్వంసం చేసింది. గాడిలో పెట్టాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాలి. ఐదు గ్యారెంటీలు అమలు చేయడంలో మేం వైఫల్యం చెందామని బహిరంగంగా కర్ణాటక కాంగ్రెస్ మంత్రులు క్షమాపణ చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఫ్యామిలీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు. అవినీతి, బంధుప్రీతి, కుటుంబ పాలన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నినాదం’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

సిగ్గు లేకుండా కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారు

‘‘దేశం , ధర్మం మా నినాదం తలాతోకాలేని విధంగా మాట్లాడటం కేసీఆర్ కుటుంబంకు అలవాటు. మెడికల్ కళాశాల కోసం కేసీఆర్ రాసిన లేఖలను బయటపెట్టాలి. సిగ్గు లేకుండా కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారు. కళాశాలలు ఎక్కడ పెట్టుకుంటారో చెప్పమంటే చెప్పలేదు. రీజనల్ రింగ్ రోడ్డు ఎందుకు ఆలస్యం అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం 500కోట్ల రూపాయలు విడుదల చేసింది.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. ఏం అంశంపైనైనా చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా లేరు. ధాన్యం సేకరణ కోసం క్వింటాల్‌కు వెయి రూపాయలు అదనంగా ఇస్తుంది. ఎకరాకు ఇరవై వేల రూపాయలు అదనపు ఆదాయం రైతులకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి డబ్బు వసూలు చేయమని చెప్పలేదు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉచిత విద్యుత్ ఇస్తాం. ఎక్కడ ఎంత విద్యుత్తు ఖర్చు అవుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ మహిళా మంత్రిని పట్టుకుని సిగ్గుందా అనడానికి కేసీఆర్‌కు సిగ్గుందా. నిర్మలా సీతారామన్ వాస్తవమే చెప్పింది’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-22T21:10:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising