K. Venkat Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేశారు
ABN, First Publish Date - 2023-12-05T22:43:22+05:30
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ని అధికారంలోకి తీసుకు రావడానికి సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ఎంతో కృషి చేశారని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Komati Reddy Venkat Reddy ) అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎనుముల రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. మంగళవారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... సోదరుడు రేవంత్‌రెడ్డి సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ని అధికారంలోకి తీసుకు రావడానికి సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ఎంతో కృషి చేశారని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Komati Reddy Venkat Reddy ) అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎనుముల రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. మంగళవారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘సోదరుడు రేవంత్‌రెడ్డి సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన రేవంత్ సీఏం కావడం సంతోషం. సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన జన్మదిన కానుక ఇది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం ఒక్క ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. తెలంగాణలో పార్టీ అధికారంలో రావడానికి సర్వ శక్తులు ఒడ్డిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తదితర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ పోరాట గడ్డపై కాంగ్రెస్ పార్టీ కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. పదేళ్ల రాష్ట్రంలో గత పాలకులు సంక్షేమాన్ని మరిచి ప్రజలకు అన్యాయం చేశారు. అవ్వన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు. అందుకే చరిత్రాత్మక తీర్పునిచ్చి, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్‌లో ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయి
‘‘కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి లేరని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేశాయి. కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకూ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయన్నది వాస్తవం. అందుకు ఉమ్మడి కార్యచరణ, ఉమ్మడి నిర్ణయాలే పార్టీకి బలం. ఇదే సిద్ధాంతాలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకొని, అధిష్ఠానానికి తీర్మానం పంపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యానికి, పార్టీలో ప్రతి నాయకుని ఉమ్మడి నిర్ణయానికి ఇచ్చే ప్రధాన్యానికి ఇది సంకేతం. ఈ ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రజా పాలనకు దోహద పడుతుంది. తెలంగాణలో ప్రజాస్వామిక, ప్రజాఅనుకూల ప్రభుత్వ పాలన రాబోతోంది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో పార్టీ కట్టుబడి ఉంటుంది’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-12-05T22:43:30+05:30 IST