ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: రేవంత్‌ రెడ్డి ఎవరు.. అవినీతిపరుడు కాదా?

ABN, First Publish Date - 2023-11-24T16:38:23+05:30

Telangana Elections: తెలంగాణ భవన్‌లో ఆటో యూనియర్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి తెలంగాణలో మార్పు వచ్చిందా లేదా? అని ప్రశ్నించారు. అప్పుడున్న భూమి ధరలు ఇప్పుడున్న భూమి ధరలు ఒక్కసారి గమనించాలన్నారు.

హైదరాబాద్: తెలంగాణభవన్‌లో ఆటో యూనియర్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి తెలంగాణలో మార్పు వచ్చిందా లేదా? అని ప్రశ్నించారు. అప్పుడున్న భూమి ధరలు ఇప్పుడున్న భూమి ధరలు ఒక్కసారి గమనించాలన్నారు. రైతులకు ఒక్క పైసా ఇవ్వని పార్టీలు ఇప్పుడు నీతలు చెబుతున్నారని విమర్శించారు. విద్యార్థుల చదువుల కోసం ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. నిజంగా నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ (Congress) నేతలు మాత్రమే అని.. వాళ్ళు పదవుల కోసం రాజకీయ నిరుద్యోగులని ఎద్దేవా చేశారు.


ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అంటూ ఒక్క ఇంటికి ఒక సీటే అన్నారని.. కానీ ఇంటికి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. ‘‘రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఎవరు అవినీతిపరుడు కాదా? నోట్ల కట్టలతో దొరకిన చిల్లరగాడు రేవంత్ రెడ్డి. వాడు కూడా నీతులు చెప్తున్నాడు’’ అంటూ విరుచుకుపడ్డారు. ఆటో యూనియన్‌లను ఆదుకున్నది కేసీఆర్ (CM KCR) మాత్రమే అని అన్నారు. రూ.100 కోట్లతో ఆటో కార్మికులను ఆదుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు సర్కస్ ఫీట్లు చేస్తున్నారన్నారు. మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకడు 48 గంటల కరెంట్ ఇస్తా అని అంటున్నారని... మనకు ఉన్నదే 24 గంటలు, కానీ 48 గంటల కరెంట్ ఎట్లా ఉంటదని ప్రశ్నించారు.

Updated Date - 2023-11-24T16:38:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising