ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Srinivas Goud: రేవంత్ సీఎం అవుతానని అంటారు.. అసలు గెలుస్తారా?

ABN, First Publish Date - 2023-11-27T12:10:27+05:30

Telangana Elections: తోడేలు వచ్చి ఓ మందపై పడ్డట్టు.. యోగి, రేవంత్ సభలు ఉన్నాయని మంత్రి శ్రీనివాసగౌడ్ విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరి అహంకార మాటలతో మహబూబ్‌నగర్ సమాజాన్ని విడతీయాలని అనుకుంటున్నారన్నారు.

మహబూబ్‌నగర్: తోడేలు వచ్చి ఓ మందపై పడ్డట్టు.. యోగి, రేవంత్ సభలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరి అహంకార మాటలతో మహబూబ్‌నగర్ సమాజాన్ని విడతీయాలని అనుకుంటున్నారన్నారు. బీజేపీ (BJP) మతం పేరుతో.. కాంగ్రెస్(Congress) కులం పేరుతో రెచ్చగొడుతూ విడగొట్టాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. వాళ్ళు ఏమి చేసారో చెప్పాలి కానీ.. తనపై వ్యక్తిగతంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్ (BJP candidate AP Mithun) నిన్నటి దాకా ఎక్కడ ఉండే.. తనను తిడితే మైలేజ్ వస్తుందని అనుకోవడం తగదని అన్నారు. రేవంత్ (TPCC Chief Revanth Reddy) తెలంగాణా కోసం ఏం చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళి ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారని విమర్శించారు.


యెన్నం శ్రీనివాసరెడ్డి నెల క్రితం దాకా బీజేపీలో ఉన్నారని.. ఇప్పుడు బీజేపీని తిడితే నమ్ముతారా అని అన్నారు. 2012లో సమాజాన్ని మతపరంగా విడతీసి గెలిచారన్నారు. రేవంత్ సీఎం అవుతానని అంటారని.. అసలు గెలుస్తారా అని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘నా చర్మం వలచి చెప్పులు కుట్టిస్త అంటాడు.. ఎవరి చర్మం ఎవరు వలుస్తాడో చూద్దాం. యెన్నం శ్రీనివాసరెడ్డి పదేళ్లు ఎక్కడ పోయిండు.. మహబూబ్ నగర్‌ను అల్లకల్లోలం చేసేందుకు వచ్చాడు. అపుడు నీవు చేసిన పనికి.. చక్క పెట్టేందుకు నాకు పదేళ్లు పట్టింది.. యెన్నం ఓ చీడ పురుగు.. ఇలాంటి వారి గురించి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, రెడ్డీ కులాల వారు ఆలోచించాలి’’ అని అన్నారు.

కౌలు రైతులకు రైతుబంధు ఇస్తా అంటున్నారని.. రైతులు హక్కులు కోల్పోతారని.. అపుడు నిజమైన రైతు ఎవరైనా కౌలుకు భూమి ఇస్తారా అని ప్రశ్నించారు. ఇక్కడ ఒక్క ఎకరా అమ్మితే.. పక్క రాష్ట్రాల్లో వంద ఎకరాల భూమికొనే స్థాయికి తెచ్చామన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు.. రేవంత్ డీఎన్‌ఏ ఒక్కటే అని.. ముగ్గురూ సమాజాన్ని విడగొట్టాలని చూస్తారన్నారు. జిల్లాలో కుల, మత రాజకీయాలు చేసేందుకే వస్తున్నారు తప్ప.. అభివృద్ది కోసం చేసేది ఏమీ ఉండదని విమర్శించారు. గెలిస్తే పాలమూరుగా పేరు పెడతాం అంటున్నారు.. కేవలం కొట్లాట పెట్టి గెలవాలి అని చూస్తున్నారన్నారు. ‘‘ప్రజలారా ఇదంతా గమనించండి. ఇంకా రెండు రోజులుంది.. అభివృద్ది ఇలాగే కొనసాగాలా పాత రోజులు రావాలా’’ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-27T12:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising