ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Narsa Reddy : ఎన్నికల్లో సింపతి కోసం కేసీఆర్, హరీశ్‌రావు కత్తి దాడికి కుట్ర చేస్తున్నారు

ABN, First Publish Date - 2023-11-28T00:12:22+05:30

కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర అంటూ సీఎం కేసీఆర్ ( CM KCR ) , బీఆర్ఎస్ నేతలు పేపర్ ప్రకటనలు చేస్తున్నారని గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రక్త చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదని నర్సారెడ్డి చెప్పారు.

సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర అంటూ సీఎం కేసీఆర్ ( CM KCR ) , బీఆర్ఎస్ నేతలు పేపర్ ప్రకటనలు చేస్తున్నారని గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు నర్సారెడ్డి ( Narsa Reddy ) కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రక్త చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదు. గజ్వేల్ కామారెడ్డి రెండుచోట్ల కేసీఆర్ ఓటమి చెందడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. దానిని అడ్డుకోవడానికి సీఎం కుట్రలు చేస్తున్నారు. మాకున్న సమాచారం ప్రకారం రేపు జరగబోయే బహిరంగ సభలో మొన్న దుబ్బాక అభ్యర్థిపై జరిగిన కోడి కత్తి దాడి గజ్వేల్‌లో కేసీఆర్‌పై జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు’’ అని నర్సారెడ్డి ఎద్దేవ చేశారు.

కేసీఆర్ సినిమా నటులను మించిపోయారు

‘‘ఆ కోడి కత్తి ప్లాన్ చేసుకొని అటు రాష్ట్రంలో సింపతి తెచ్చుకొని.. ఇటు గజ్వేల్ కామారెడ్డిలో గెలవాలని పథకం వేసుకున్నట్లు మాకు సమాచారం ఉంది. డ్రామా ఆడటంలో సీఎం కేసీఆర్ సినిమా నటులను మించిపోయారు. గజ్వేల్‌లో ఓటమి చెందుతారని తెలిసి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో దాడి సింపతిని సృష్టించబోతున్నారు. రేపు జరగబోయే బహిరంగ సభలో కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు లేదా కార్యకర్తపై కత్తి దాడి చేయించుకునే కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని నర్సారెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-28T00:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising