ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Elections: హైదరాబాద్‌లో నామినేషన్‌ల హడావుడి.. భారీగా ట్రాఫిక్ జాం

ABN, First Publish Date - 2023-11-09T14:17:35+05:30

Telangana Elections: తెలంగాణలో రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. నేడు మంచి రోజు కావడంతో ఆయా పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు భారీ ర్యాలీలతో బయలుదేరారు. సిటీలో నామినేషన్ల హడావుడితో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.

హైదరాబాద్: తెలంగాణలో (Telangana State) రేపటితో (నవంబర్ 10) నామినేషన్ల పర్వం ముగియనుంది. నేడు మంచి రోజు కావడంతో ఆయా పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు భారీ ర్యాలీలతో బయలుదేరారు. సిటీలో నామినేషన్ల హడావుడితో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతో నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లపై వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి. ర్యాలీలు, రోడ్ షోలతో వాహనదారులు నరకాయతన అనుభవిస్తున్నారు. కిలోమీటర్ ప్రయాణానికి గంటకు పైగా సమయం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కూకట్‌పల్లి నుంచి ఎర్రగడ్డ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలాగే జీడిమెట్ల నుంచి బాలనగర్ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేబీఆర్‌ పార్క్ నుంచి పంజాగుట్ట మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈరోజు మంచి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు.

Updated Date - 2023-11-09T14:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising