ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrasekhar: బీజేపీకి బిగ్ ఝలక్.. ఆ కీలక నేత రాజీనామా.. ఏ పార్టీలో చేరారంటే..?

ABN, First Publish Date - 2023-10-29T22:01:56+05:30

బీజేపీ పార్టీ ( BJP Party ) కి బిగ్ ఝలక్ తగిలింది. మహబూబ్‌నగర్‌లో ఆ పార్టీకి సీనియర్ నేత, మాజీమంత్రి పీ. చంద్రశేఖర్ ( P. Chandrasekhar ) రాజీనామా చేశారు.

మహబూబ్‌నగర్: బీజేపీ పార్టీ ( BJP Party ) కి బిగ్ ఝలక్ తగిలింది. మహబూబ్‌నగర్‌లో ఆ పార్టీకి సీనియర్ నేత, మాజీమంత్రి పీ. చంద్రశేఖర్ ( P. Chandrasekhar ) రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ టికెట్‌ను ఆయన ఆశించారు. కానీ బీజేపీ అధిష్ఠానం మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర భంగపాటుకు గురయ్యారు పార్టీ కోసం ఎంతగానో కష్టపడితే తనకు టికెట్ ఇవ్వకపోవడంతో తన అనుచరుల దగ్గర ఈ ప్రస్తావనను తీసుకొచ్చారు. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీనే కరెక్ట్ అని ఆయన కారు పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఆదివారం నాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌తో సమావేశం అయ్యారు. ఈ నేతలతో ప్రగతి భవన్‌కు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సమక్ష్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కేటీఆర్ చంద్రశేఖర్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పీ. చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ...‘‘కేసీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరాను. తెలంగాణ సాధించాక గతంలో అనివార్య కారణాల వల్ల పార్టీ వీడాను. ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్‌కు చేదోడు వాదోడుగా ఉంటాను. బీజేపీలో నాకు కనీస మర్యాద ఇవ్వలేదు. అందుకే రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కలే. గత 9 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపట్టాడు. ముదిరాజ్‌లకు అనివార్య కారణాల వల్లే కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదు. సిటింగ్‌లలో ముదిరాజ్‌లు లేనందునే ముదిరాజ్‌లకు టికెట్ రాలేదు. ప్రభుత్వ సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు ముదిరాజ్‌లకు కూడా అందుతున్నాయి. బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ముదిరాజ్‌లు అనవసరంగా నిందించొద్దు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ముదిరాజ్‌లు అందరూ ఏకతాటిపై ఉండి నిలబెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో ముదిరాజ్‌లకు ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో అవకాశాలు వస్తాయి. నేను కూడా కింది స్థాయి నుంచే ఎదుగుతూ వచ్చాను. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గెలుపు కోసం కృషి చేస్తాను’’ అని పీ. చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-29T22:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising