Lakshman: ఈ నెల 7న తెలంగాణకు ప్రధాని మోదీ
ABN, First Publish Date - 2023-11-04T18:26:54+05:30
ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లో బీజేపీ పార్టీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ) ని ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
హైదరాబాద్: ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లో బీజేపీ పార్టీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ) ని ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈమేరకు బీజేపీ అధిష్ఠానం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( Lakshman ) ఈ మేరకు మీడియాకు వివరాలు తెలిపారు. ఈసందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..యావత్ సమాజం సభకు హాజరుకావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. బీజేపీ ప్రకటనతో బీసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీసీలు రెడీగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. బీసీల చిరకాల వాంఛ ముఖ్యమంత్రి పదవి. బీసీ ముఖ్యమంత్రి ప్రకటనను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవహేళన చేస్తున్నాయి. ఏఐసీపీ అగ్రనేత రాహుల్ గాంధీ, మంత్రి కేటీఆర్‌లు బీసీ సీఎం ప్రకటన పై వ్యగ్యంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ, కేసీఆర్, కేటీఆర్ల మెడలు వంచాలని బీసీ సమాజాన్ని కోరుతున్నాను. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉందా? అని లక్ష్మణ్ సవాల్ విసిరారు.
Updated Date - 2023-11-04T18:26:55+05:30 IST