ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy : పొన్నాల కేసీఆర్ పంచన చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా?

ABN, First Publish Date - 2023-11-15T19:06:39+05:30

సీఆర్ ( KCR ) పంచన మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ( Ponnala Lakshmaia ) చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు.

జనగామ: కేసీఆర్ ( KCR ) పంచన మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ( Ponnala Lakshmaia ) చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు. బుధవారం నాడు జనగామలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడతూ..‘‘ఈ జన సందోహాన్ని చూస్తుంటే కాలనాగుల పని పట్టడానికి పుట్టలోనుంచి చీమలు బయటకు వచ్చినట్లుంది. జనగామలో పల్లా రాజేశ్వర‌రెడ్డిని ఓడించి బొంద పెట్టడానికి వచ్చిన మీకు అభినందనలు. పొన్నాల లేడని ఇక్కడ ఇబ్బంది జరుగుతదేమో అనుకున్నా...కానీ మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చింది. కన్నతల్లి లాంటి పార్టీని, కార్యకర్తలను మోసం చేసినవారికి బండకేసి కొడతామని నిరూపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసి చెప్పిండు. వీళ్లిద్దరి బాగోతం గడీలో ఉన్న దొరకు తెలుసు’’ అని రేవంత్‌రెడ్డి ఎద్దేవ చేశారు.

ప్రగతి భవన్‌లో ప్రజలకు ప్రవేశం లేదు

‘‘ఈ ప్రాంతంలో మట్టికి ఒక పౌరుషం ఉంది. దొరల రాజ్యంపై పోరాటం చేసి ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర ఈ ప్రాంతానిది. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను మోసం చేసి పొన్నాల శత్రువు పంచన చేరాడు. అమెరికాలో మాట్లాడుకుని కేసీఆర్ పంచన చేరాడు. జనగామ ప్రజలు లక్ష కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారో ధర్మం వైపు ఉంటారో తేల్చుకోండి. ప్రజా ప్రభుత్వంలో పేదలను ఆదుకునేందుకు సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాహిళలకు ప్రతీ నెల రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు, ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు ఆర్థికసాయం అందజేస్తాం. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్ లోకి కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికీ ప్రవేశం లేదు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఏంది లేకుంటే ఏంది? కేసీఆర్ ఉంటే మీకు వచ్చే పెన్షన్ రూ.2వేలు.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడగొడితే రూ.4వేలు వస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేయూత పథకం ద్వారా నెలకు రూ.4వేలు పెన్షన్ అందిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2023-11-15T19:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising