Revanth Reddy : కేసీఆర్ దొంగనోటు లాంటివాడు
ABN, First Publish Date - 2023-11-24T18:40:48+05:30
కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు, హైదరాబాద్‌లో పది వేల ఎకరాలను సీఎం కేసీఆర్ ( CM KCR ) దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) వ్యాఖ్యానించారు.
నల్గొండ: కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు, హైదరాబాద్‌లో పది వేల ఎకరాలను సీఎం కేసీఆర్ ( CM KCR ) దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు రేవంత్ నకిరేకల్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..‘‘ఎలక్షన్స్....కలెక్షన్స్... సెలక్షన్స్ పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారు. నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్యను నమ్మిన కార్యకర్తలను నట్టేట ముంచి పార్టీ ఫిరాయించి దొర గడీకి చేరిండు. పార్టీ పిరాయించిన 12మందిని అసెంబ్లీ గేటు తాకనివ్వొద్దు. కోమటిరెడ్డికి పేరు వస్తుందని ఎస్ఎల్బీసీని పక్కన పెట్టారు. కేసీఆర్ దొంగనోటు లాంటివాడు. నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా.. కేసీఆర్ దొంగనోటు లాంటివాడు. 30లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్‌లో రోడ్లపై ఖాళీగా తిరుగుతున్నారు. వీరేశంను 40వేల మెజారిటీతో గెలిపించాలి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Updated Date - 2023-11-24T18:40:55+05:30 IST