Share News

Revanth Reddy: గోయల్ ఇంటి నుంచి మంత్రుల ఇళ్లకు డబ్బులు..: రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2023-11-25T13:28:46+05:30 IST

మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంటి నుంచి వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంకా ఆయన నివాసంలో రూ.300 కోట్లు ఉన్నాయన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ నుంచి సీఈఓ వికాస్ రాజ్‌కి వంద సార్లు కాల్ చేసినా ఎత్తలేదన్నారు. ఇద్దరం ఎంపీలం కలిసి వికాస్ రాజ్‌తో మాట్లాడడానికి ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదన్నారు. గోయల్ ఇంట్లో ఏం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

Revanth Reddy: గోయల్ ఇంటి నుంచి మంత్రుల ఇళ్లకు డబ్బులు..: రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంటి నుంచి వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంకా ఆయన నివాసంలో రూ.300 కోట్లు ఉన్నాయన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ నుంచి సీఈఓ వికాస్ రాజ్‌కి వంద సార్లు కాల్ చేసినా ఎత్తలేదన్నారు. ఇద్దరం ఎంపీలం కలిసి వికాస్ రాజ్‌తో మాట్లాడడానికి ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదన్నారు. గోయల్ ఇంట్లో ఏం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. వివేక్ కాంగ్రెస్‌లోకి రావడానికి సమన్వయం చేసిన వారిని ఈడీ ఇబ్బంది పెడుతోందన్నారు. మోదీ ప్రసంగాలకు, జరుగుతున్న తతంగాలకు పొంతన లేదన్నారు. వీర్లపల్లి శంకర్, బీర్ల ఐలయ్య లాంటి సామాన్యులకు మేం టికెట్ ఇచ్చామని రేవంత్ పేర్కొన్నారు.

సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలం..

కేసీఆర్ ప్రజాదర్బార్ పెడతాడో, జనతా బార్ పెడతాడో వాళ్ళకే తెలియాలన్నారు. వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని రేవంత్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మోదీ మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బయట పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ జేసీబీ, క్రేన్ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కో కేసీఆర్ భావిస్తున్నారన్నారు. పదేళ్ల పాటు సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ పంచుకొని ఆస్తులు పంచుకున్నారన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే బండి సంజయ్‌ని తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నాడని రేవంత్ విమర్శిస్తున్నాడన్నారు. కాంగ్రెస్‌కి పడే ఓట్లను చీల్చడానికి బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

పోలింగ్ ముందు వేసేలా ప్లాన్..

‘‘కేసీఆర్ గెలిస్తే ఇదే చివరి రైతుబంధు అవుతుంది. కేసీఆర్ ఓటుకు పదివేలు పంచే ప్రయత్నం చేస్తున్నారు. రైతుబంధుకు అనుమతి తెచ్చుకున్న వాళ్ళు దళితబందు, బీసీ బందు, మైనారిటీ బందుకి అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు? ఎన్నికల్లో మా పోటీ ఈడీ, ఐటీ తోనే ఉంది. కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులు, గోయల్ ఇంటిపై దాడి, రైతుబంధు విషయంలో మోదీ, కేసీఆర్ స్నేహం స్పష్టంగా అర్థం అవుతోంది. జూన్ 2018 న రైతుబంధు మొదలైంది. 2018లో కేంద్రంతో ఒప్పందం చేసుకొని ఎన్నికలను ముందస్తుగా జరిపి రైతుబంధు వేశారు. పోలింగ్ కోసం లైన్‌లో నిలబడ్డ తర్వాత ఓటర్లకు డబ్బులు వేశారు. రైతుబంధు ద్వారా ప్రజలను ఆకర్షించారు అని స్పష్టంగా అర్థం అవుతోంది. డిసెంబర్ చివరి నుంచి మార్చి వరకూ వేయాల్సిన రైతు బందును కావాలని పోలింగ్ ముందు వేసేలా ప్లాన్ చేశారు’’ అని రేవంత్ పేర్కొన్నారు.

బీజేపీలో రాముడు.. కాంగ్రెస్‌లో రావణుడా?

‘‘నవంబర్ 15 లోపే రైతుబంధు వేయాలని డిమాండ్ చేశాం. పోలింగ్‌కి నాలుగు రోజుల ముందు కేంద్రం, ఎన్నికల సంఘం కలిసి బీఆర్ఎస్‌కి హెల్ప్ చేసింది. మేం అధికారంలోకి వస్తే జనవరిలో 15 వేలు ఇస్తామని ప్రకటించాం. ఇప్పుడు బీఆర్ఎస్ 10 వేలు మాత్రమే ఇస్తోంది. బీఆర్ఎస్ రైతులందరికీ 5 వేల నష్టం చేస్తున్నారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనవరిలో రైతులకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు ఇచ్చిన వాగ్ధానం నెరవేరుస్తాం. వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు లేవు. బీజేపీలో ఉన్నప్పుడు రాముడిగా కనిపించిన వివేక్.. కాంగ్రెస్‌లోకి రాగానే రావణసూరుడిగా మారాడు. కేసీఆర్‌ని గద్దె దించేందుకు కంకణం కట్టుకున్నాడు కాబట్టే పొంగులేటిపై దాడులతో హింసిస్తున్నారు. పొంగులేటి బంధువు అయినందుకే రామసహయం సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు’’ అని రేవంత్ తెలిపారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-25T13:37:32+05:30 IST