TS Polls: సొంతూళ్లకు ప్రజలు... ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద తొక్కిసలాట
ABN , First Publish Date - 2023-11-30T08:52:24+05:30 IST
Telangana Elections: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్లకు ప్రజలు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసోయింది.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్లకు ప్రజలు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్ బస్టాండ్ (MGBS Bus Stand) ప్రయాణికులతో కిక్కిరిసోయింది. అయితే అధిక సంఖ్యలో ప్రయాణికులు ఊర్లకు వెళ్లేందుకు తరలిరావడంతో బస్టాండ్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. సొంతూళ్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వారితో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. అయితే ఆర్టీసీ (TSRTC) సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం, కోదాడ మార్గాల్లో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఊర్లకు వెళ్లేందుకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి