TS Polls : కేసీఆర్‌కు దిమ్మదిరిగే కౌంటరిచ్చిన తుమ్మల..!!
ABN, First Publish Date - 2023-11-05T23:02:00+05:30
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయ్. అంతకుమించి సవాళ్లు, ప్రతి సవాళ్లు.. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయ్. అంతకుమించి సవాళ్లు, ప్రతి సవాళ్లు.. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు. ఆదివారం నాడు ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి పువ్వాడ అజయ్ గురించి కేసీఆర్ మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించారు. పువ్వాడ ప్రత్యర్థి.. కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో గులాబీ బాస్ ఫైర్ అయ్యారు. అయితే.. కేసీఆర్ పర్యటన అనంతరం తుమ్మల కూడా దిమ్మదిరిగే కౌంటరిచ్చారు.
తుమ్మల కౌంటర్ ఇదీ..
మూలన కూర్చుంటే మంత్రి పదవి ఇచ్చానని కేసీఅర్ అంటున్నారు నేను అంతకు ముందు మూడు సార్లు మంత్రినన్న విషయం ప్రజలకు తెలుసు
నేను కేసీఆర్‌కు మంత్రి పదవీ ఇప్పించానో లేదో వెళ్లి చంద్రబాబును అడిగితే తెలుస్తుంది
నీకు ఫారెస్ట్ మంత్రి పదవి ఇస్తే.. అది ఇష్టం లేకుంటే చంద్రబాబుతో మాట్లాడి రవాణా శాఖా ఇప్పించానా లేదా..?
ఖమ్మం జిల్లాలో జెండా గులాబీ కట్టేవాడు లేక బతిమాలి నన్ను పార్టీలో చేర్చుకొని మంత్రిని చేసావు
నా మంత్రి పదవీ ప్రజల కోసం.. సీతారామ ప్రాజెక్ట్ కోసం
మళ్లీ వచ్చి సీతారామ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తానని కేసీఆర్ అంటున్నారు అంటే వాళ్ల పరిస్థితి జనాలకు అర్థమవుతుంది
పువ్వాడ వయ్యారి భామ లాంటోడు.. పూజకు పనికి రాని పువ్వు
పువ్వాడ కమ్యూనిస్ట్ పార్టీని వైసీపీనీ, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి మా గురించి మాట్లాడటం సిగ్గుచేటు
కమీషన్ల కోసం గోళ్ళ పాడు ఛానల్ కాంట్రాక్టర్‌ను మార్చి 70 కోట్ల పని 170 కోట్లకు పెంచారు
కాంగ్రెస్ ప్రభుత్వంలో నాడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నా ఖమ్మం మున్సిపాలిటినీ కార్పొరేషన్‌గా మార్చాను
రఘునాథ పాలెం మండలం ఏర్పాటు నేనే చేశా
దానవాయి గూడెం, పుట్ట కోట, లకారం మంచినీటి పథకాలు నేను తెచ్చానో నీవు తెచ్చావో బహిరంగ చర్చకు సిద్దమా..?
నీ తండ్రి హయాంలో ఖమ్మంలో ట్యాంకర్లు గతి.. గుర్తు లేదా పువ్వాడ..?
నేను ఖమ్మంలో తాగునీటి కష్టాలు దూరం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాను
నేనేంటి అనేది ఖమ్మం ప్రజానీకంకు బాగా తెలుసు
కేసీఆర్ ఏం మాట్లాడారు..?
ఖమ్మం నియోజకవర్గ ప్రజలు మంచి చెడు ఆలోచించి ఓటేయాలి
పువ్వాడ అజయ్ ని గెలిపిస్తే ప్రజలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు.. అలా కాదని తుమ్మలు, తుప్పలు తెచ్చుకుంటే ముళ్లు గుచ్చుకునేది మీకే
పువ్వాడ పువ్వులు కావాలో.. తుమ్మ ముళ్లు కావాలో తేల్చుకోండి
పువ్వాడ అజయ్ పట్టుబట్టి నాతో రూ.700 కోట్లు మంజూరు చేయించుకున్నాడు.. ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు
ఖమ్మం పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని పువ్వాడ అజయ్ భావిస్తున్నాడు.. దయచేసి మరోసారి గెలిపించండి
ఖమ్మంలో ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు లేవు.. ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలకు నిలయంగా ఉన్న ఖమ్మం ఇప్పుడెంత భద్రంగా ఉందో చూడండి
పువ్వాడ అజయ్ కష్టపడి పనిచేశాడు కాబట్టే ఇంత అభివృద్ధి జరిగింది.. మళ్లీ గెలిపిస్తా ఇంకా అభివృద్ధి చేస్తాడు
Updated Date - 2023-11-05T23:02:04+05:30 IST