Thummala Nageswara Rao: బీఆర్ఎస్ పాలనలో అవినీతి, విధ్వంసం, అరాచకం పెచ్చుమీరాయి
ABN, First Publish Date - 2023-11-04T14:46:07+05:30
బీఆర్ఎస్ ( BRS ) పాలనలో అవినీతి, విధ్వంసం, అరాచకం పెచ్చుమీరాయని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) ఆరోపించారు.
ఖమ్మం: బీఆర్ఎస్ ( BRS ) పాలనలో అవినీతి, విధ్వంసం, అరాచకం పెచ్చుమీరాయని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) ఆరోపించారు. శనివారం నాడు నేలకొండపల్లి మండల బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను, పొంగులేటి బీఆర్ఎస్ పార్టీని ఖమ్మం జిల్లాలో బలోపేతం చేశాం. కానీ సీఎం కేసీఆర్ మమ్మల్ని దూరం చేసి పార్టీని నాశనం చేకుకున్నారు. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల నేతలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నదమ్మల్లా పనిచేయాలి. నేను పొంగులేటి ఇద్దరం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయంతో నేను ఖమ్మంలో, పొంగులేటి పాలేరు నుంచి బరిలో ఉన్నాం. కరవు కాటకాలు, పల్లేర్లు మొలచిన పాలేరును నేను అభివృద్ధి చేశా. మట్టి పిసుక్కునే నన్ను మంత్రిగా చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకంకు రుణపడి ఉంటాను. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలి. భారత్ జోడో యాత్రతో దేశాన్ని ఐక్యం చేసిన రాహుల్ గాంధీ నాయకత్వంలో నేను పొంగులేటి గౌరవంగా పార్టీలో చేరాం. నాకు ప్రజలు ఇచ్చిన గౌరవం పొంగులేటికి హాయిగా బతికే స్థోమత ఉంది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో మా ప్రయాణం ప్రారంభించాం. సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ జయ కేతనంతో బీఆర్ఎస్‌లో కలవరం మొదలైంది. పాలేరు, ఖమ్మం కీర్తి ప్రతిష్టలు పెరిగేలా నేను పొంగులేటి పనిచేస్తాం’’ అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Updated Date - 2023-11-04T14:46:08+05:30 IST