ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RevanthReddy: కేసీఆర్ మొగోడే అయితే సింగరేణి ఎన్నికలను ఎందుకు జరపలేదు?

ABN, First Publish Date - 2023-11-11T16:47:21+05:30

చీకట్లో మగ్గుతున్న రామగుండంలో వెలుగులు రావాలంటే కాంగ్రెస్ గెలవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.

రామగుండం: చీకట్లో మగ్గుతున్న రామగుండంలో వెలుగులు రావాలంటే కాంగ్రెస్ గెలవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లు బంద్ చేయిస్తానన్న సీఎం కేసీఆర్ (CM KCR) ఫామ్ హౌస్‌లో పడుకున్నారన్నారు. ఇసుక, బొగ్గు, బూడిద ఏదీ వదలకుండా దోచుకుని ఇక్కడి ఎమ్మెల్యే బంధిపోటు దొంగలా మారారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబానికి కప్పం కడుతుండు కాబట్టే మళ్లీ ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించారని వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కార్మికుల ఎన్నికలను కోర్టుకు పోయి వాయిదా వేయించారన్నారు. కేసీఆర్ మొగోడే అయితే సింగరేణి ఎన్నికలను ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ జరగాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ప్రతీ నెలా రేషన్ సన్న బియ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 రావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలని చెప్పుకొచ్చారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. బిల్లు చూడగానే కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు అందిస్తామన్నారు. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4000 పెన్షన్ అందిస్తామని తెలిపారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేరాలంటే కాంగ్రేస్ అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-11T16:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising