Bandi Sanjay: హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఉగ్రవాద సంస్థ చీఫ్‌కు ఒవైసీ ఫ్యామిలీతో సంబంధాలు
ABN, First Publish Date - 2023-05-10T19:36:20+05:30
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఉగ్రవాద సంస్థ చీఫ్‌కు (terrorist organization chief) ఒవైసీ ఫ్యామిలీతో (Owaisi family) సంబంధాలు ఉన్నాయని తెలంగాణ బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఉగ్రవాద సంస్థ చీఫ్‌కు (terrorist organization chief) ఒవైసీ ఫ్యామిలీతో (Owaisi family) సంబంధాలు ఉన్నాయని తెలంగాణ బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన ఆరోపణలు చేశారు. ఒవైసీ కుటుంబ డెక్కన్ మెడికల్ కాలేజీలో హెచ్‌ఓడీగా ఉన్నాడని, ISIS ఉగ్రవాదులకు న్యాయసాయం చేస్తామని గతంలో ఒవైసీ ప్రకటించాడని సంజయ్ గుర్తు చేశారు.
రోహింగ్యాలకు హోంమంత్రి మహమూద్ షెల్టర్ ఏర్పాటు చేశారని, అనంతగిరి కొండల్లో తీవ్రవాదులకు శిక్షణ సాగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. యువకులకు మతం మార్చి ఉగ్రవాదులుగా మారుస్తున్నారని, హిందువులు కూడా ఉగ్రవాదులు అని చూపించడానికి ఎంఐఎం ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించిందని బండి సంజయ్ మండిపడ్డారు. ఉగ్రవాదులు పట్టుబడుతుంటే ఇప్పటివరకు రివ్యూ నిర్వహించలేదని, పోలీసులను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వడం లేదని బండి సంజయ్ ఆరోపించారు.
సంపాదించిన డబ్బు కాపాడేందుకే సలహాదారుడి నియామకం చేపట్టారని, అవినీతి ఆరోపణలు ఉన్న సోమేశ్‌కుమార్‌ను ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోరాటానికి బీజేపీ మద్దతు ఉంటుందని, ORR టోల్ కేటాయింపులపై సీబీఐ విచారణ కోరుతూ కేసీఆర్ ప్రభుత్వం లేఖ రాయాలని, అన్ని ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
Updated Date - 2023-05-10T19:37:41+05:30 IST