ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: వైసీపీ గాలికి వచ్చిన పార్టీ..గాలికే కొట్టుకుపోతుంది..

ABN, First Publish Date - 2023-03-19T13:35:29+05:30

టీడీపీ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) ధన్యవాదాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: టీడీపీ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections for graduates) టీడీపీ ఘన విజయం సాధించింది. 3 స్థానాల్లో టీడీపీ(TDP) అఖండ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులకు ధన్యవాదాలు. ఇది ప్రజల విజయం. ప్రజా తీర్పును తిరుగుబాటుగా చూడాలి. రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారు. బాధ్యతతో వచ్చి ప్రజలు వైసీపీకి(YCP) వ్యతిరేకంగా ఓటు వేశారు. జగన్‌ బాధ్యత లేని వ్యక్తి.. మోసాలు చేయడంలో దిట్ట. జగన్‌ ఎన్నికల్లో మళ్లీ గెలిచే పరిస్థితి లేదు. తెలుగుదేశానిది జనబలం.. వైసీపీది ధనబలం. జగన్ చేసిన అరాచకం, విధ్వంసం, రాష్ట్రానికి చేసిన ద్రోహమే అతనిని ఓడిస్తాయి. జగన్ అక్రమ మార్గంలో పాలన సాగించాడు. 40 ఏళ్లు చూడని అక్రమాలు ఈ నాలుగేళ్లలో చూశాను. ఓటర్ జాబితా మొదలు, ఓటు వేసే వరకు అంతా అక్రమమే. జగన్ లాంటి దారుణమైన వ్యక్తిని నేనెన్నడూ చూడలేదు. జగన్ ఒక అహంకారి, ఒక సైకో. ఇక పులివెందులలో తిరుగుబాటు మొదలైంది. తాను మాత్రమే బాగుండాలనుకునే వ్యక్తి జగన్(Jagan) వచ్చే ఎన్నికలు జగన్ వర్సెస్ పబ్లిక్. జగన్ అరాచకాలు కొనసాగాలా? రాష్ట్ర భవిష్యత్తు కావాలా అని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. చెడుకు ఎప్పటికైనా ఓటమి ఖాయం. వైసీపీ గాలికి వచ్చిన పార్టీ..గాలికే కొట్టుకుపోతుంది. ప్రజలను నిత్యం మోసం చేసినా పట్టించుకోరని జగన్ ధీమా. మేం ప్రజాస్వామ్యాన్ని నమ్మితే జగన్ అరాచకాలను నమ్మారని’’ చంద్రబాబు అన్నారు.

Updated Date - 2023-03-19T13:35:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising