ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకేసారి ఇద్దరు కీలక నేతల పాదయాత్రలు.. పాలకుర్తిలో టెన్షన్.. టెన్షన్

ABN, First Publish Date - 2023-02-14T10:20:09+05:30

ప్రస్తుతం నడుస్తున్నది పాదయాత్రల కాలం.. ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో కీలక నేతలంతా పాదయాత్ర బాట పడుతున్నారు. ఫోన్ లేదంటే వేరే మార్గం ద్వారా జనాలను కలిసే కంటే నేరుగా వెళ్లి కలిస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. అంతేకాకుండా గతంలో కూడా ఈ పాదయాత్రలు సత్ఫలితాలను ఇచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ : ప్రస్తుతం నడుస్తున్నది పాదయాత్రల కాలం.. ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో కీలక నేతలంతా పాదయాత్ర బాట పడుతున్నారు. ఫోన్ లేదంటే వేరే మార్గం ద్వారా జనాలను కలిసే కంటే నేరుగా వెళ్లి కలిస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. అంతేకాకుండా గతంలో కూడా ఈ పాదయాత్రలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఏపీని ఉదాహరణకు తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారానే అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. అంతకు ముందు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం పాదయాత్ర ద్వారానే అధికారాన్ని దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీలో పాదయాత్ర బాట పట్టారు.

ఇక తెలంగాణలో ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అలాగే వైస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్రల టెన్షన్ చోటు చేసుకుంది. ఇవాళ సాయంత్రానికి రేవంత్ రెడ్డి, షర్మిల పాదయాత్రలు పాలకుర్తి చేరుకోనున్నాయి. రేపు, ఎల్లుండి పాలకుర్తిలో రేవంత్, షర్మిల పాదయాత్రలు నిర్వహించనున్నారు. ఇద్దరు కీలక నేతల పాదయాత్రలు ఒకే నియోజకవర్గంలో ఉండటంతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

గతంలో పాలకుర్తి నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా రగడ చోటు చేసుకుంది. బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలోనే బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అది క్రమంగా ఘర్షణకు దారి తీసింది. బండి సంజయ్ నాడు మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. అది అక్కడే ఉన్న బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ వ్యాఖ్యలతో విభేదించారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేస్తూ బండి సంజయ్‌కు అడుగడునా అడ్డు తగిలారు. మళ్లీ ఇలాంటి ఘటనలు ఇప్పుడు పునరావృత్తం అవుతాయని ప్రచారం జరుగుతుండటంతో పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.

Updated Date - 2023-02-14T10:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising