Hanumakonda: బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
ABN , First Publish Date - 2023-04-27T16:21:18+05:30 IST
వరంగల్ జిల్లా: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)కు హనుమకొండ కోర్టులో ఊరట లభించింది.

వరంగల్ జిల్లా: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)కు హనుమకొండ కోర్టు (Court)లో ఊరట లభించింది. బెయిల్ రద్దు పిటిషన్ (Bail Cancellation Petition)ను కొట్టివేసింది. టెన్త్ పేపర్ లీకేజీ కేసు (Tenth paper leakage case)లో అరెస్టు అయిన బండి సంజయ్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్‌ను ఈనెల 5వ తేదీన పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కాగా పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బండి సంజయ్ కుట్ర చేస్తున్నారని.. అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR)లో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని, పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని బీజేపీ శ్రేణులకు ఉద్దేశపూర్వకంగా పిలుపునిచ్చారని పోలీసులు పేర్కొన్నారు. బండి సంజయ్ చర్యల వల్ల పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అందుకే ముందస్తుగా అరెస్టు చేశామన్నారు. అనేక మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకుని, పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్‌ని ప్రివెన్షన్ కింద అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
అయితే మాస్ కాపీయింగ్ (Mass Copying) వ్యవహారంలో బండి సంజయ్ పాత్రకు సంబంధించి ఎక్కడా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో మెన్షన్ చేయలేదు. కేవలం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నారని... అందుకే అరెస్టు చేసి.. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.
