Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
ABN, Publish Date - Dec 18 , 2023 | 05:34 PM
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay ) సోమవారం నాడు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఆయన ఏం పేర్కొన్నారంటే.. ‘‘మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను బండి సంజయ్ లేఖలో ప్రస్తావించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay ) సోమవారం నాడు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఆయన ఏం పేర్కొన్నారంటే.. ‘‘మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను బండి సంజయ్ లేఖలో ప్రస్తావించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలి. నీలోజిపల్లి నుంచి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌ను, స్కిల్ డెవలెప్ మెంట్ కాలేజీని ఏర్పాటు చేయండి. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ రావుతో పాటు మాజీ సీఎం కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలి. తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలి. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా అకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలి’’ అని బండి సంజయ్ సూచించారు.
Updated Date - Dec 18 , 2023 | 06:35 PM