ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: కవితకు ఈడీ నోటీసులపై పీసీసీ చీఫ్ ఎందుకు మాట్లాడం లేదు?

ABN, First Publish Date - 2023-03-10T13:57:02+05:30

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) కు ఈడీ నోటీసుల (ED Notice)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Telangana Bjp Chief Bandi Sanjay) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కవిత (BRS MLC)కు నోటీసులపై పీసీసీ అధ్యక్షుడు (PCC Chief) ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలు వేర్వేరు కాదని మరోసారి స్పష్టం అయ్యిందన్నారు. లిక్కర్ స్కాంలో సంబంధం ఉందా? లేదా? సీఎం, పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కాంకు, తెలంగాణ సమాజానికి సంబంధం ఏంటని అన్నారు. తెలంగాణ సమాజానికి చెప్పి కవిత లిక్కర్ దందా చేసిందా అంటూ నిలదీశారు. ఉద్యమకారుల గురించి పట్టించుకోని కేసీఆర్.. తన కుటుంబానికి ఆపద వస్తే వణికిపోతున్నారన్నారు. అవినీతిపరులు ఎవరైనా మోదీ సర్కార్ (Modi Government) వదిలే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.

కవిత వల్ల మహిళాలోకం తలదించుకునే పరిస్థితి...

అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఢిల్లీలో కవిత చేపట్టిన ధర్నాపై బండి మాట్లాడుతూ.. ఢిల్లీలో కాదు.. ప్రగతి భవన్ ముందు కవిత ధర్నా చేయాలన్నారు. సిగ్గు లేకండా కేసీఆర్ (KCR) బిడ్డ ఢిల్లీ పోయి దీక్ష చేస్తోందని ఫైర్ అయ్యారు. 33 శాతం బీఆర్ఎస్ టికెట్లు మహిళలకు ఇవ్వనందుకు తన తండ్రి కేసీఆర్‌ను కవిత ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ 33శాతం రిజర్వేషన్ గురించి ఎందుకు పార్లమెంట్‌లో మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ కవిత వలన మహిళా లోకం తల దించుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తన దందాలో నుంచి కవిత పేద మహిళలకు వాటా ఇవ్వాలన్నారు. కేసీఆర్ క్యాబినెట్‌లో 33శాతం మహిళా మంత్రులు ఎందుకు లేరని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులే మహిళలకు శాపంగా మారారన్నారు. కేసీఆర్ హాయాంలో మహిళా సర్పంచ్‌కే రక్షణ లేకుంటే.. సామాన్యల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జాన్సీ లక్ష్మీబాయి, రాణీరుద్రమదేవి మాదిరి కవిత తనను తాను ఊహించుకుంటోందని యెద్దేవా చేశారు. మహిళల రిజర్వేషన్లు గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతకాని తనం వలనే తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహిళల పట్ల‌ సీఎం కేసీఆర్ కోపం, కసితో వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-10T13:57:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising