ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP on Liquor Scam: బీజేపీ ఎదురుదాడి.. కవిత తెలంగాణ పరువుతీశారన్న బండి సంజయ్

ABN, First Publish Date - 2023-03-08T13:17:17+05:30

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు కేంద్ర కక్ష సాధింపు చర్యలో భాగమే అంటూ బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavaitha)కు ఈడీ నోటీసులు కేంద్ర కక్ష సాధింపు చర్యలో భాగమే అంటూ బీఆర్‌ఎస్ నేతలు (BRS Leaders) చేసిన ఆరోపణలపై బీజేపీ (BJP) ఎదురుదాడికి దిగింది. కవిత (Kavitha)కు ఈడీ నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) ఘాటుగా స్పందించారు. కేసీఆర్ బిడ్డ కవిత తెలంగాణ (Telangana) పరువు తీశారన్నారు. మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు బీఆర్ఎస్‌ (BRS)కు లేదని విమర్శలు గుప్పించారు. సీబీఐ (CBI), ఈడీ (ED)తో బీజేపీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేయకుంటే కవిత తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఎవరు అవినీతి చేసినా.. చట్టానికి అతీతులు కాదన్నారు. కవిత లిక్కర్ కుంభకోణాన్ని తెలంగాణ సమాజానికి ముడి పెట్టడం ఏంటని ప్రశ్నించారు. గతంలో ఎంతో మందిని విచారణ సంస్థలు విచారించాయని... కవిత కొత్తేం కాదని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ మంత్రుల విమర్శలు...

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన ఈడీ.. 9న విచారణకు రావాల్సిందిగా పేర్కొంది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు సమయం కావాలని ఈడీని కవిత కోరారు. అయితే కవితకు ఈడీ నోటీసులపై తెలంగాణ మంత్రులు (Telangana Ministers) తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మహిళా దినోత్సవం రోజే కవితకు నోటీసులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం కక్ష పూరిత ధోరణిని తెలియజేస్తోందని మంత్రులు సత్యవతి రాథోడ్ (Satyavati Rathod), ఎర్రబెల్లి దయాకర్‌ రావు (Errabelli dayakar rao) అన్నారు. కేంద్రం విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో లొగందీసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై మరింతగా పోరాడుతామని మంత్రులు స్పష్టం చేశారు.

కవితకు ఈడీ నోటీసులు మోదీ ప్రభుత్వ (Modi Government) దుర్మార్గాలకు పరాకాష్ట అని మరో మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) మండిపడ్డారు. మోదీ దురాగతాలను బయటపెడుతున్న కేసీఆర్‌ (CM KCR)పై కుట్రలో భాగమే కవితకు నోటీసులు అని అన్నారు. అణచివేత దోరణితోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. మోదీ (Prime Minister Narendra Modi) దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-03-08T13:22:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising