Bandi Sanjay: కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోంది... బండి కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-03-16T13:46:39+05:30
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుపై దేశరాజధాని ఢిల్లీలో హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) లో ఈడీ విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) హాజరుపై దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేసీఆర్ (CM KCR) బిడ్డకు జైలు రెడీ అవుతోందని అని అన్నారు. గురువారం చంచల్‌గూడ్ జైలుకు వెళ్లిన బండి.. రిమాండ్‌లో ఉన్న బీజేవైఎం (BJYM) కార్యకర్తలతో ములాఖత్ అయ్యారు. బీజేవైఎం నేతలను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఒత్తిడితోనే బీజేవైఎం కార్యకర్తలను జైలుకు పంపించారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఐటీ శాఖ విఫలం కారణంగానే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని ఆరోపించారు.
ప్రతిదానికి బండి సంజయ్‌ను బద్నాం చేయటం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందన్నారు. బీఆర్ఎస్‌కు కేసీఆర్ కుటుంబానికి ఒక రూల్.. ఇతరులకు మరొక రూలా అని ప్రశ్నించారు. కొడుకును కాపాడుకోవటానికి సీఎం కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లో ఉన్న రేణుక కుటుంబం కోసమే పేపర్ లీకేజీ అని అన్నారు. అక్రమంగా రేణుకకు గురుకుల పాఠశాలలో ఉద్యోగం ఇచ్చారని మండిపడ్డారు. కేటీఆర్ భట్టేబాజ్ వేషాలు మానుకోవాలని మండిపడ్డారు. నిరుద్యోగుల తరుపున పోరాడుతోన్న భానుప్రకాష్‌ను పోలీసులు వేధిస్తున్నారన్నారు. జైలుకు పంపింనంత మాత్రానా బీజేవైఎం వెనుకడుగు వేసే ప్రకస్తే లేదని స్పష్టం చేశారు. సిట్‌తో ఉపయోగం లేదని.. లీకేజీపై సిట్టింగ్ జడ్జిరో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ని రద్దు చేసి.. ఛైర్మన్‌ను ప్రాసిక్యూట్ చేయాలన్నారు. తప్పించుకోవటానికే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. పోటీ పరీక్షలు నిర్వహించలేని స్థితిలో కేసీఆర్ సర్కార్ ఉందని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-03-16T13:46:39+05:30 IST