ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanti: అసద్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు

ABN, First Publish Date - 2023-06-01T08:23:48+05:30

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని... అది బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల అంతర్గత వ్యవహారమని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ (MIM Chief Asaduddin) చేసిన వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని... అది బీఆర్‌ఎస్, కాంగ్రెస్ (Congress), ఎంఐఎంల (MIM) అంతర్గత వ్యవహారమని బీజేపీ నేత విజయశాంతి (BJP Leader Vijayashanti) అన్నారు. సయామీ ట్రిప్లెట్స్‌పై మూడు పార్టీలు కూడా ఎన్నికల ముందో తర్వాతో పొత్తో - కూటమో, సర్దుబాటో అనేది వారికే తెలుస్తుందన్నారు. స్టీరింగ్ తమ చేతిలో ఉంటే దేవాలయాలకు కోట్ల రూపాయల కేటాయింపు ఎట్లా జరుగుతది అన్న ఓవైసీజీ కామెంట్ మాత్రం పరిశీలించాల్సిన అంశమన్నారు. తమ్ముడు ఈటెల (Etela Rajender) మంత్రిగా కూడా జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ప్రగతిభవన్ గేటు దాటలేదని... కానీ బైక్‌పై వచ్చిన ఎంఐఎం వంటి టీఆర్‌ఎస్ సయామీలు లోనికి గౌరవంగా వెళ్లగలుగుతారని వ్యాఖ్యలు చేశారు. ఇది ఏ విధమైన అవగాహన అనేది తెలంగాణ ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ (BRS) స్టీరింగ్ మా ఎంఐఎం చేతుల్లో ఉన్నదని గతంలో ఎంఐఎం చెప్పింది వాస్తవమని... ఆ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఎన్నడూ ఖండించలేదన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ స్టీరింగ్ తమ చేతుల్లో లేదని ఎంఐఎం ఎన్నికల సంవత్సరంలో చెబుతుందని... దానిపై బీఆర్‌ఎస్‌ ఎలా స్పందిస్తుందో తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంపైర్‌గా ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ చేస్తున్నది కేవలం షాడో బాక్సింగ్ అంతే అంటూ విజయశాంతి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-06-01T08:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising